Sunday, May 19, 2024
- Advertisement -

30 సంవ‌త్సరాల త‌ర్వాత మొద‌టి సారిగా భార‌త్ ఆర్మీలోకి శతఘ్నులు…

- Advertisement -
Indian army gets its first artillery -M777 guns after thirtey years tested at pokhran today

ప్ర‌పంచంలోని చాలా దేశాలు త‌మ ఆయుధ సంప‌త్తిని పెంచుకుంటుండ‌టంతో భార‌త్ కూడా త‌న ఆయుధాల సామ‌ర్థ్యాన్ని పెంచుకుంటోంది.ప‌క్క‌లో బ‌ల్లెంలా మారిన పాక‌స్థాన్‌,చైనాను నిలువ‌రించాలంటె ఆయుధ వ్య‌వ‌స్థ‌ను మ‌రింత అధునీక‌రించాల్సిన అవ‌సురం ఉంది.

దీనిలో భాగంగానే ఇప్పుడు ఆర్మీ అమ్ముల పొదిలోకి మ‌రో కొత్త ఆయుధాలు చేరాయి.
దాదాపు మూడు దశాబ్దాల తర్వాత భారత సైన్యంలోకి శతఘ్నులు చేరాయి. అమెరికా నుంచి తొలిసారిగా ఈ శతఘ్నులను ఆర్మీ కొనుగోలు చేసింది. దీనిలో భాగంగా రెండు ఎం-777 ఆల్ట్రా-లైట్‌ హొవిట్జర్‌ ఆయుధాలు నేడు భారత్‌కు చేరుకున్నాయి.

{loadmodule mod_custom,Side Ad 1}
1980లలో స్వీడన్‌ నుంచి బొఫోర్స్‌ తుపాకులను(శతఘ్నులు) చివరిసారిగా భారత్‌ కొనుగోలు చేసింది. ఆ తర్వాత నుంచి ఇటువంటిఆయుధాలను మళ్లీ ఆర్మీలోకి తీసుకోలేదు. అయితే గతేడాది జరిగిన కేంద్రమంత్రివర్గ సమావేశంలో మళ్లీ ఈ శతఘ్నుల ప్రస్తావన వచ్చింది. సైన్యం తన ఆయుధ సంపత్తిని వృద్ధి చేసుకునేందుకు శతఘ్నులు కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంటామని కేంద్ర కేబినెట్‌కు తెలిపింది. దీనికి గతేడాది నవంబర్‌లో కేబినెట్‌ ఆమోదించడంతో 700మిలియన్‌ డాలర్లతో ఆయుధాలు కొనుగోలు చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

{loadmodule mod_custom,Side Ad 2}
అమెరికాతో ఈ ఆయుధాల కొనుగోలు ఒప్పందంలో భాగంగా….మొత్తం 145 శతఘ్నులను కొనుగోలు చేయగా వాటిల్లో రెండు నేడు భారత్‌కు చేరుకున్నాయి.ఇవి దాదాపు 30 కిలో మీటర్ల లక్ష్యాన్ని సైతం అవి తుత్తునీయలు చేస్తాయి.వీటిలో 25 ఆయుధాలను బీఏఈ సిస్టిమ్స్‌ను డెలివరీ చేస్తుండగా.. మిగిలిన 120 శతఘ్నులను మహింద్రా కంపెనీ సాయంతో భారత్‌లోనే తయారుచేయనుంది. వీటిలో రెండు నేడు ఆర్మీ అందుకుంది. మిగిలినవి కూడా త్వరలోనే రానున్నాయి.
153ఎంఎం/39 కాలిబర్‌ సామర్థ్యం కలిగిన ఈ ఆయుధాలను సరిహద్దుల్లోని ఎత్తైన ప్రదేశాల్లో ఉపయోగిస్తారు. 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని తుత్తునియ‌లు చేయ‌గ‌ల సామ‌ర్థ్యం వీటికి ఉంది.

Also read

  1. పాక్ ఉగ్ర‌వాద దాస్ప్ర‌చారాన్ని కాశ్మీర్ యువ‌త తిప్పికొట్టాలి ఆర్మీ ఛీప్ రావ‌త్‌…
  2. మావోలు ఆయుధ ప్ర‌ద‌ర్శ‌న‌
  3. మ‌రో స‌హాసం చేసిన‌ ఉత్త‌ర కొరియా….
  4. ఉత్త‌ర కొరియా దూకుడ‌కు చైనా,ర‌ష్యా లే కార‌నం .. మా జోలికి వ‌స్తే చూస్తూ ఊరుకోమ‌న్న అమెరికా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -