- Advertisement -

కొండా సురేఖ Vs కడియం శ్రీహరి – ఢిల్లీకి చేరిన పంచాయితీ..

- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త పంచాయితీ మొదలైంది. వరంగల్ కేంద్రంగా తాజా – మాజీ మంత్రుల వార్ పీక్ కు చేరింది. ఇప్పుడు ఈ వ్యవహారం ఢిల్లీకి చేరింది. నేరుగా పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేయటంతో ఈ వ్యవహాం పైన రాష్ట్ర నేతలు సీరియస్ గా ఉన్నారు. గతంలోనే అనేక విభేదాలు ఉన్నా.. పార్టీ సూచనతో కలిసి పని చేస్తున్నట్లు కనిపించిన వారి మధ్య తిరిగి ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. కాంగ్రెస్ లో ఇప్పుడు ఈ వ్యవహారం సంచలనంగా మారుతోంది.

వరంగల్ కాంగ్రెస్ నేతల మధ్య కొత్త పంచాయితీ మొదలైంది. మంత్రి సురేఖకు తెలియకుండానే కడియం శ్రీహరి స్టేషన్‌ఘన్‌పూర్‌ పరిధిలోని ఆలయాల పరిస్థితులపై హైదరాబాద్‌లో దేవాదాయ శాఖ కమిషనర్‌తో ఎండోమెంట్ రివ్యూ నిర్వహించారు. దేవదాయ శాఖ మంత్రినైన తనకే తెలియకుండా కడియం శ్రీహరి రివ్యూ చేయడంపై మంత్రి కొండా సురేఖ తీవ్ర తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కడియంపై నేరుగా ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు. హైకమాండ్‌కు రాసిన లేఖను బహిర్గత పరచొద్దని రాష్ట్ర నేతలు సూచించినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు మరోసారి తెర పైకి వచ్చింది. పార్టీ నేతలకు ఈ వ్యవహారం సమస్యగా మారుతోంది.
దీని పైన రాష్ట్ర నేతలు ఆరా తీస్తున్నట్లు సమాచారం.

మంత్రిగా ఉన్న తన నియోజకవర్గం.. తాను పర్యవేక్షిస్తున్న శాఖలోని వ్యవహారాల పైన కడియం శ్రీహరి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖను కనీసం సంప్రదించకుండా, ఆమెకు సమాచారం ఇవ్వకుండానే కడియం శ్రీహరి సమీక్షా సమావేశాన్ని నిర్వహించడమే కాకుండా.. స్టేషన్ ఘన్‌పూర్ లోని ప్రధాన ఆలయాల అభివృద్ధికి సమగ్ర మాస్టర్ ప్లాన్లు సిద్ధం చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ను నేరుగా ఆదేశించడం కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. తాజాగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు నియామకంలో తనను పూర్తిగా పక్కనబెట్టడం కొండా సురేఖ ఆగ్రహం తో ఉన్నారు. ఈ వరుస పరిణామాల వేళ కొండా సురేఖ తదుపరి కార్యాచరణ పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -