పట్టాభిరామ్ మృతి తీరని లోటు అన్నారు మాజీ సీఎం జగన్. డాక్టర్ బీవీ పట్టాభిరామ్ మృతి పట్ల జగన్ సంతాపం వ్యక్తం చేశారు. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, ఇంద్రజాలికుడిగా, రచయితగా ఆయన ప్రసిద్ధి చెందారని, తెలుగు, ఇంగ్లీష్, కన్నడ, తమిళ భాషల్లో పట్టాభిరామ్ రాసిన పుస్తకాలు బాగా ప్రాచుర్యం పొందాయన్నారు.
అలాగే విద్యార్థుల కోసం తెలుగు రాష్ట్రాల్లో వేలాది పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు, వర్క్‌షాపులు, సెమినార్లను నిర్వహించి వారి జీవితాలపై ప్రభావం చూపారన్నారు. పట్టాభిరామ్ మృతితో విద్యా, వ్యక్తిత్వ వికాస రంగాల్లో తీవ్ర లోటు ఏర్పడిందన్నారు. పట్టాభిరామ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
గుండెపోటుతో ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు పట్టాభిరామ్. ఆయన వయస్సు (75) .ఇంద్రజాలికుడిగా, మానసికవైద్యుడిగా, ప్రముఖ హిప్నాటిస్ట్‌గా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.ఇంద్రజాలకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు పట్టాభిరామ్. మానసిక వైద్యుడిగా, మోటివేషనల్ స్పీకర్‌గా మారారు. ఇదే క్రమంలో అనేక పుస్తకాలను రచించారు.ఆయన ప్రసంగాలు లక్షలాది మందికి స్పూర్తినిచ్చాయి. అంతేగాదు మానసిక సమస్యల నుంచి బయటపడేందుకు దోహదపడ్డాయి.
జూలై 2వ తేదీన ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు ఆయన నివాసంలో అభిమానుల సందర్శనార్ధం ఉంచనున్నారు. అనంతరం జూలై 2వ తేదీ మధ్యాహ్నం 3:00 గంటలకు మహాప్రస్థానంలో జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
