- Advertisement -
కేటీఆర్, కవితపై సీఐడీకి ఫిర్యాదు చేసింది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్. CID ఆడిషన్ డీజీ చారుసిన్హాను కలిసిన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు హెచ్సీఏలో జరిగిన అక్రమాల వెనుక కేటీఆర్, కవిత హస్తం ఉందని ఆరోపించారు.
హెచ్సీఏ ఎన్నికల్లోకి హఠాత్తుగా జగన్మోహన్ రావు రావడం వెనుక కేటీఆర్, కవిత హస్తం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. HCA ప్రెసిడెంట్ గా జగన్మోహన్ రావు గెలవగానే.. నా విజయం కేటీఆర్, కవిత, హరీష్ రావుకి అంకితం అని చెప్పారని ఫిర్యాదులో పేర్కొన్నారు టీసీఏ ప్రతినిధులు.
కేటీఆర్, కవితతో పాటు HCAలో ఉన్న మరికొందరు అక్రమార్కులపై కూడా దర్యాప్తు చేయాలని సీఐడీని కోరారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు.
