- Advertisement -

333 కిలోల లడ్డూ.. రూ.99కే వేలం!

- Advertisement -

వినాయక చవితి నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది. ఇక మెజార్టీ గణపయ్యలను నిమజ్జనం చేయగా లడ్డు వేలంపాట ప్రత్యేక ఆకర్షణ. బాలాపూర్ లడ్డూ ఈసారి వేలంలో ఏకంగా రూ.35 లక్షలు పలకగా రాజేంద్రనగర్‌ సన్‌ సిటీలోని రిచ్‌మండ్ విల్లాలో ఏకంగా రూ.2.32 కోట్లు పలికింది.

అయితే వేలం పాటలో లడ్డూని పోటీ పడి పాడతారు. కానీ కొత్తపేట లడ్డూ లక్కీ డ్రా యువతకు ప్రేరణగా నిలుస్తోంది. కొత్తపేటలోని శ్రీ ఏకదంత యూత్‌ అసోసియేషన్ ప్రత్యేకంగా లక్కీ డ్రా నిర్వహించి 333 కిలోల లడ్డూని కేవలం రూ.99తో బీబీఏ విద్యార్థి సాక్షిత్‌ గౌడ్‌ దక్కించుకోవడం విశేషం. సుమారు 760 టోకెన్లు విక్రయించగా, అదృష్టం అతనిపై పడటంతో భక్తులంతా ఆనందించారు.

ఇక సాధారణ కుటుంబానికి చెందిన విద్యార్థి ఇంత పెద్ద లడ్డూని పొందడం అదృష్టం మాత్రమే కాదు.. భక్తిశ్రద్ధల ఫలితం అన్న నమ్మకం స్థానికులలో పెరిగింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -