- Advertisement -

భారత్‌లో పెళ్లి..విదేశాల్లో విడాకులా?

- Advertisement -

భారత్‌లో హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకుని ఆ తర్వాత విదేశాలకు వెళ్లి అక్కడి కోర్టుల ద్వారా విడాకులు పొందే ధోరణిపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారతీయ చట్టాల ప్రకారం జరిగిన పెళ్లిళ్ల రద్దు విదేశీ కోర్టుల ఉత్తర్వుల ద్వారా సాధ్యం కాదని స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ దంపతుల వివాహ వివాద కేసు విచారణ సందర్భంగా జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్ర, జస్టిస్ శ్రీచంద్రశేఖర్‌లతో కూడిన ద్వయ ధర్మాసనం విదేశీ కోర్టులు ఇచ్చే విడాకుల డిక్రీల చెల్లుబాటుపై పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రీధర్‌రెడ్డి అనే వ్యక్తికి 2003లో భారతీయ హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం జరిగింది. పెళ్లయిన అనంతరం ఆయన తన భార్యతో కలిసి ఇంగ్లాండ్ వెళ్లారు. అక్కడ వారికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత వారి మధ్య విభేదాలు రావడంతో శ్రీధర్‌రెడ్డి ఏపీలోని సత్తెనపల్లి కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేయగా అది కొట్టివేతకు గురైంది.

దీంతో ఆయన ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకుని 2014లో యూకేలోని ‘కేంబ్రిడ్జ్ కౌంటీ కోర్టు’ను ఆశ్రయించి విడాకులు పొందారు. అనంతరం అక్కడే మరొక మహిళను వివాహం చేసుకున్నారు. తన అనుమతి లేకుండా విదేశీ కోర్టు ద్వారా విడాకులు పొంది రెండో పెళ్లి చేసుకున్నారంటూ మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై బహుభార్యత్వా (Bigamy) కింద క్రిమినల్ కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ శ్రీధర్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

భారతీయ హిందూ వివాహ చట్టం ప్రకారం జరిగిన పెళ్లిళ్లను అదే చట్టంలోని నిబంధనల ప్రకారం మాత్రమే రద్దు చేయాలి. విదేశీ కోర్టుల ద్వారా పొందే విడాకులు ఇక్కడ చెల్లవు” అని ధర్మాసనం స్పష్టం చేసింది. పురుషులు విదేశాలకు వెళ్లి ఏదో ఒక కాగితం చూపించి విడాకులు పొంది అక్కడే వేరొకరిని పెళ్లి చేసుకోవడం వల్ల ఇక్కడ భారతదేశంలో ఉన్న మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -