- Advertisement -

అభిమానుల ఎదుగుదలే నాకు నిజమైన ప్రేమ: చిరంజీవి

- Advertisement -

అభిమానుల విజయాలు చూసి ఆనందించే గుణం గొప్ప నాయకుడి లక్షణం. తాజాగా ‘చెన్నై లవ్‌స్టోరీ’ ప్రీ రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి. కిరణ్‌ అబ్బవరం హీరోగా, శ్రీగౌరీ ప్రియ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించగా.. సాయిరాజేశ్, ఎస్‌.కె.ఎన్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో, బుధవారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

‘‘నా అభిమానుల్ని నేను ఎంతగానో ఇష్టపడతాను. వాళ్లు జీవితంలో ఎదిగితే ప్రాణప్రదంగా చూసుకుంటాను. నన్ను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో అందరూ గర్వించేలా ఎదిగారంటే, అదే వాళ్లు నాపై చూపించే నిజమైన ప్రేమ అని భావిస్తా. అలాంటి నా అభిమానుల్ని ఇక్కడ ఈ వేదికపై చూడటం నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది’’ అని చిరంజీవి పేర్కొన్నారు. సినిమా పేరు వినగానే తన పాత జ్ఞాపకాలు, చెన్నైతో ఉన్న అనుబంధం గుర్తుకొచ్చాయని తెలిపారు.

ఈ వేడుకకు రావడానికి అసలు కారణం తన అభిమానులేనని చెబుతూ.. ఎస్‌.కె.ఎన్‌, సాయిరాజేశ్‌, దర్శకుడు రవి నంబూరి, హీరో కిరణ్‌ అబ్బవరం తన అభిమానులని గుర్తుచేసుకున్నారు. కిరణ్‌ పవన్ కల్యాణ్ అభిమాని అని తెలిపారు. సాదాసీదా కుటుంబాల నుంచి వచ్చి, అసాధారణమైన కలలతో పరిశ్రమలో సక్సెస్ సాధించిన తన అభిమానులను చూసి ముచ్చటపడతానని చెప్పారు. ప్రతి ఒక్కరూ కలలు కనాలని, నమ్మకంతో ముందుకు వెళ్తే విజయం తథ్యమని సూచించారు. కిరణ్‌ అబ్బవరం పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాడని, తెలుగు అమ్మాయి శ్రీగౌరీ ప్రియ ఇతర భాషల్లోనూ రాణించడం గర్వకారణమన్నారు.

హీరో కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ.. తన సినిమా వేడుకకు చిరంజీవి అతిథిగా రావడం జీవితంలో మరువలేని క్షణమని, ఆయన పేరు కేవలం పేరు కాదు ఓ భావోద్వేగం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శివ నిర్వాణ, నవీన్ ఎర్నేని, రవిశంకర్, మణిశర్మ, త్రిగుణ్, అనంత శ్రీరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -