ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేసారు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో ఢిల్లీలో నాలుగు రోజులుగా కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు కొనసాగిస్తోంది. ఛలో పార్లమెంట్ ఉద్రిక్తతకు దారి తీసింది. వీరికి మద్దతుగా రాహుల్ గాంధీ నేరుగా ప్రధాని ఇంటి వద్ద ధర్నా చేసారు. పార్లమెంట్ సమావేశాలు స్తంభించాయి. ఈ సమయంలో ప్రధాని మోదీ కీలక ప్రకటన చేసారు. పేపర్ల లీకు… చర్యల పైన హామీ ఇచ్చారు.
ఢిల్లీలో నిరసనలు కొనసాగుతున్న వేళ ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటన చేసారు. ప్రస్తుత పరిణామాల పైన స్పందించారు. తన ట్వీట్ లో.. విద్యార్థుల భవిష్యత్తు, సంక్షేమం కంటే ముఖ్యమైనది మరొకటి లేదని, పేపర్ లీక్‌లకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్ట బోమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇలాంటి వాటిని అరికట్టడానికి, బాధ్యులకు కఠినమైన శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు, అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడటం, పరీక్షా వ్యవస్థ సమగ్రతను పరిరక్షించడం లక్ష్యంగా తీసుకున్న చర్యల పరంపరలో ఈ నిర్ణయం కూడా ఒక భాగంగా వివరించారు.
అదే విధంగా అదే విధంగా పేపర్ లీక్‌ల ద్వారా దేశ యువత భవిష్యత్తును ప్రమాదంలో పడేయాలని చూసే వారిని వదిలిపెట్టబోమని ఆయన గట్టి హెచ్చరిక జారీ చేశారు. అయితే, మరో వైపు కాక్రోచ్ పార్టీ మాత్రం తాము చర్చలకు సిద్దమని చెబుతూనే.. తటస్థ వేదికల పైన అయితే నే తాము ముందుకు వస్తామని చెబుతోంది. మంత్రులు ప్రజల్లోకి రావాలి. జంతర్‌మంతర్ వద్దకు వచ్చి చర్చలు జరపాలి. భద్రతాకారణాల రీత్యా ఇక్కడ వద్దనుకుంటే.. దగ్గరలోని ఏదైనా తటస్థ వేదిక వద్ద చర్చలకైనా వస్తాం. చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి మేం సిద్ధం’ అని సౌరవ్‌దాస్ స్పష్టం చేశారు. జంతర్‌మంతర్ వద్ద వేలాదిమంది ఉన్నారని, ఉద్యమం కొనసాగుతుందని.. బిహార్, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్ తదితర ప్రాంతాలకు విస్తరించిందని అన్నారు.
