- Advertisement -
జీఎస్టీ సంస్కరణలపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ స్పందించారు. ఇది విప్లవాత్మకమైన అడుగు అంటూ ఎక్స్ వేదికగా ప్రశంసలు కుప్పించారు. ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగుపడటంతో పాటు కొత్త ఊపిరి అందుతుంది అన్నారు జగన్.
జీఎస్టీ పునర్ వ్యవస్థీకరణ ద్వారా పన్ను విధానం మరింత సులభతరం అన్నారు. వస్తువుల ధరలు తగ్గడంతోపాటు సేవలు సులభంగా అందుతాయి… ఇది ప్రశంసనీయమైన చర్య అన్నారు. అక్కడక్కడా చిన్న చిన్న సమస్యలు వచ్చినా అంతిమంగా వినియోగదారులకు మేలు చేకూరుతుంది అన్నారు.
