- Advertisement -

ప్రియుడి మోజులో కన్నబిడ్డను..

- Advertisement -

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనో, ఏడుస్తున్నాడనో కన్న కొడుకును తల్లి, ఆమె ప్రియుడు కలిసి దారుణంగా కొట్టి చంపేశారు. ఈ ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సిద్దిపేట జిల్లా తీగుల్ గ్రామానికి చెందిన స్వామి, భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలతో కలిసి కీసర మండలం చీర్యాలలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో జ్యోతికి తన గ్రామానికి చెందిన పాత స్నేహితుడు నవీన్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నెల 29న భర్త ఇంట్లో లేని సమయంలో, జ్యోతి తన ప్రియుడు నవీన్‌ను ఇంటికి పిలిపించుకుంది. అదే సమయంలో కుమారుడు హరికృష్ణ (3) పదేపదే ఏడుస్తుండటంతో జ్యోతి, నవీన్‌ తీవ్ర అసహనానికి లోనయ్యారు. కోపంతో బాలుడిని విచక్షణారహితంగా కొట్టడంతో చిన్నారి స్పృహ తప్పిపడిపోయాడు. వెంటనే వారు బాలుడిని నాగారంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

బాలుడి మరణాన్ని మూర్ఛ వ్యాధితో మంచం మీద నుంచి పడి చనిపోయాడని జ్యోతి భర్తను నమ్మించింది. భార్య మాటలను నమ్మిన స్వామి, అంత్యక్రియలు పూర్తి చేశాడు. అయితే, కొన్ని రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన స్వామికి ఇంట్లో రక్తపు మరకలు కనిపించాయి. అనుమానం వచ్చిన అతను సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా, ఘటన జరిగిన రోజు నవీన్ ఇంటికి వచ్చి వెళ్లిన దృశ్యాలు బయటపడ్డాయి. జ్యోతి, నవీన్ కలిసి తన బిడ్డను చంపేశారని గ్రహించిన స్వామి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసుల విచారణలో జ్యోతి తన నేరాన్ని ఒప్పుకుంది. తన ప్రియుడితో కలిసి బిడ్డను హత్య చేసినట్లు ఆమె అంగీకరించింది. ఈ మేరకు కీసర పోలీసులు జ్యోతి, నవీన్‌ను అరెస్టు చేశారు. మూర్ఛతో చనిపోయాడని నమ్మించి, కన్నబిడ్డనే కడతేర్చిన తల్లి ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -