- Advertisement -

ప్రసిద్ధ్ కమ్‌బ్యాక్!

- Advertisement -

ధర్మశాలలో జరిగిన సిరీస్ మొదటి మ్యాచ్‌లో ఓవర్లకు 7 పరుగుల చొప్పున సమర్పించుకుని తీవ్ర నిరాశపరిచిన ప్రసిద్ధ్ కృష్ణను లక్నోలో జరిగిన రెండో వన్డే జట్టు నుంచి తప్పించారు. అయితే చెన్నైలో జరిగిన మూడో మ్యాచ్‌తో తిరిగి జట్టులోకి వచ్చిన ఆయన, తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ముద్దాడుకున్నారు. అద్భుతమైన పునరాగమనంతో భారత్ వైపు తిప్పేసి క్లీన్‌స్వీప్‌ చేయడంలో కీలకపాత్ర పోషించాడు.

పిచ్‌పై ఉన్న పేస్, బౌన్స్, స్వింగ్‌ను అద్భుతంగా వాడుకుంటూ ప్రసిద్ధ్ పవర్‌ప్లేలో చెలరేగిపోయారు. కొత్త బంతితో ప్రత్యర్థి టాప్ ఆర్డర్‌ను కంగారు పెడుతూ.. కేవలం 5 ఓవర్లలో 6 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టి అఫ్గానిస్తాన్‌ను 36 పరుగులకే 4 వికెట్లతో పీకల్లోతు కష్టాల్లోకి నెట్టారు. ఆ తర్వాత అఫ్గానిస్తాన్ కోలుకునే ప్రయత్నం చేసినప్పటికీ, మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన ప్రసిద్ధ్.. ప్రత్యర్థి కెప్టెన్‌ను అవుట్ చేయడం ద్వారా వన్డే క్రికెట్‌లో తన తొలి ఐదు వికెట్ల ఘనతను సాధించారు.

యశస్వి జైస్వాల్ ఈ సిరీస్‌లో తన అవకాశం కోసం ఓపికగా ఎదురుచూడాల్సి వచ్చింది. మొదటి మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితమై.. రెండో వన్డేలో ఫ్లాట్ పిచ్‌పై తక్కువ పరుగులకే అవుట్ అయి లభించిన అవకాశాన్ని చేజార్చుకున్నారు. అయితే మూడో మ్యాచ్‌లో ఎలాగైనా నిరూపించుకోవాలనే పట్టుదలతో, 219 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో యువ ఓపెనర్ ఇన్నింగ్స్ బాధ్యతను భుజాన వేసుకున్నారు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ ఆరంభంలో ఆచితూచి ఆడగా, జైస్వాల్ మాత్రం అఫ్గాన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. పవర్‌ప్లే ముగిసేసరికి భారత్‌ను వికెట్ నష్టపోకుండా 10 ఓవర్లలోనే 86 పరుగుల భారీ స్కోరుకు చేర్చారు. అదే జోరును కొనసాగిస్తూ కేవలం 38 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశారు. ఆ తర్వాత కూడా ఏమాత్రం తగ్గకుండా కేవలం 83 బంతుల్లోనే తన కెరీర్‌లో రెండో వన్డే సెంచరీని నమోదు చేశారు. చివరి వరకు 110 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, ఇంకా 21 ఓవర్లు మిగిలి ఉండగానే భారత్‌కు ఘన విజయాన్ని అందించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -