- Advertisement -

మహేష్ బాబు ‘వారణాసి’పై భారీ క్రేజ్!

- Advertisement -

గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘వారణాసి’. ఈ భారీ చిత్రం కోసం ప్రేక్షకులు, సినీ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, తాజాగా ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులపై ఆసక్తికర చర్చ మొదలైంది.

ఈ సినిమా కేవలం ఇండియన్ వర్షన్ ఓటీటీ హక్కుల కోసమే ప్రముఖ సంస్థలు భారీ మొత్తాన్ని ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. కేవలం డిజిటల్ హక్కులకే పరిమితం కాకుండా, శాటిలైట్ హక్కులను కూడా ఒకేసారి సొంతం చేసుకునేందుకు ఆయా సంస్థలు ప్రయత్నిస్తున్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. భారీ బడ్జెట్ మరియు భారీ కాంబినేషన్ కావడంతో, ఏ సంస్థ ఈ హక్కులను దక్కించుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం ఈ రేసులో జీ5 (ZEE5) లేదా జియో హాట్‌స్టార్ (Jio Hotstar) వంటి అగ్రగామి ఓటీటీ సంస్థలు ముందున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న చిత్రం కావడంతో, నిర్మాతలు కూడా శాటిలైట్, డిజిటల్ హక్కుల విషయంలో పక్కా ప్లానింగ్‌తో ఉన్నట్లు తెలుస్తోంది. అధికారికంగా ఏ సంస్థతో ఒప్పందం కుదురుతుందనేది త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ గ్లోబల్ ప్రాజెక్టులో మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకమైన విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ క్రేజీ కాంబినేషన్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -