- Advertisement -

ఏటీఎం పిన్ నంబర్ రాసి.. పిల్లలకు విషమిచ్చి..

- Advertisement -

చిత్తూరు జిల్లాలో ఒక కుటుంబం బలైంది. భార్య అనారోగ్యంతో బాధపడుతుండటాన్ని తట్టుకోలేక, ఆమెకు, ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, అనంతరం తండ్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

చిత్తూరు జిల్లా దిగుమసపల్లె పంచాయతీలోని బంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన దామోదరం (30), తన భార్య నిర్మల (25), పిల్లలు రాజేష్ (13), శ్రీవిద్య (11)తో కలిసి నివసిస్తున్నాడు. గత కొంతకాలంగా నిర్మల బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ విషమించడంతో దామోదరం తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. భార్యను కాపాడుకోలేకపోతున్నాననే బాధతో, ఆ కుటుంబం మొత్తం ముగిసిపోవాలని నిర్ణయించుకున్నాడు. మొదట భార్య, ఇద్దరు పిల్లలకు విషమిచ్చి హతమార్చిన దామోదరం, అనంతరం తానూ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఘటనా స్థలంలో పోలీసులు ఒక సూసైడ్ నోట్‌ను గుర్తించారు. అందులో తన ఏటీఎం పిన్ నంబర్, ఫోన్ పే నంబర్లను దామోదరం రాసి ఉంచాడు. తమ అంత్యక్రియల కోసం ఆ ఖాతాలో ఉన్న డబ్బునే ఉపయోగించాలని కోరుతూ ఆయన విజ్ఞప్తి చేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనారోగ్య సమస్యతో ఒక కుటుంబం పూర్తిగా కనుమరుగవ్వడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -