- Advertisement -

సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర కీలకం!

- Advertisement -

సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అమూల్యమైనది అన్నారు మాజీ సీఎం జగన్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కుటుంబాన్ని నిలబెట్టే శక్తి మహిళలదే. మహిళలు ఆర్థికంగా ఎదిగితే కుటుంబాలు బలపడతాయి, కుటుంబాలు బలపడితే సమాజం అభివృద్ధి చెందుతుంది, తద్వారా రాష్ట్రం మరింత ముందుకు సాగుతుంది. ఈ నమ్మకంతోనే మా ప్రభుత్వం మహిళల సంక్షేమం, సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది అన్నారు.

మహిళలు ప్రతి రంగంలో ముందుకు రావాలనే లక్ష్యంతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాము. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం స్వయం సహాయక సంఘాలకు ప్రోత్సాహం అందిస్తూ, ఉపాధి అవకాశాలను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నాము. అంతేకాకుండా మహిళలు నాయకత్వ స్థానాల్లో కూడా ఎదగాలని భావించి ప్రభుత్వంలో కీలక పదవుల్లో వారికి అగ్ర తాంబూలం ఇచ్చాము అన్నారు.

మహిళలు కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వహించడంతో పాటు సమాజ అభివృద్ధి కోసం కూడా తమ వంతు కృషి చేస్తున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, వ్యాపారం, రాజకీయాలు, సాంకేతిక రంగాలు వంటి ప్రతి విభాగంలో మహిళలు తమ ప్రతిభను చాటుతూ సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తున్నారు.

మహిళల శక్తి, ప్రతిభ, పట్టుదల సమాజానికి ప్రేరణ. వారి కృషితోనే దేశం, రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. కుటుంబాన్ని, సమాజాన్ని, భవిష్యత్తును నిర్మిస్తున్న ప్రతి మహిళకు మనం గౌరవం తెలియజేయాలి. ఈ సందర్భంగా కుటుంబ బాధ్యతలతో పాటు సమాజ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ప్రతి మహిళకు పేరు పేరున హృదయపూర్వకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళల సాధికారతే సమాజ పురోగతికి మార్గమని మరోసారి గుర్తుచేసుకుంటూ వారికి నా వందనాలు అని చెప్పారు జగన్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -