- Advertisement -

ఇరాన్ వార్..తాత్కాలిక బ్రేక్!

- Advertisement -

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇరాన్‌పై దాడుల విషయంలో తాత్కాలిక విరామాన్ని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.ఇరాన్‌పై వచ్చే ఐదు రోజుల పాటు ఎలాంటి దాడులు చేయబోమని ట్రంప్ తెలిపారు. ముఖ్యంగా విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను నిలిపివేస్తామని స్పష్టం చేశారు.

గత రెండు రోజులుగా Iranతో జరుగుతున్న చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించి, యుద్ధాన్ని పూర్తిగా నిలిపివేయడమే లక్ష్యంగా ఈ చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.

ఇటీవలి కాలంలో ఇరాన్, అమెరికా మధ్య పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ తాత్కాలిక విరామం ద్వారా ఇరువైపులా చర్చలకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ ప్రకటనపై అంతర్జాతీయ వర్గాలు సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. యుద్ధ పరిస్థితులు తగ్గి, శాంతి చర్చలు ముందుకు సాగుతాయనే ఆశలు వ్యక్తమవుతున్నాయి.

మొత్తంగా, ఐదు రోజులపాటు దాడులను నిలిపివేయాలన్న అమెరికా నిర్ణయం పశ్చిమాసియా పరిస్థితుల్లో కీలక మలుపుగా మారే అవకాశముంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -