- Advertisement -

రాజధాని నిర్మాణాల్లో భారీ అవినీతి!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాల పేరుతో అధికార కూటమి ప్రభుత్వం భారీ అవినీతికి తెరలేపిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని… ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో తీవ్ర అక్రమాలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు అమరావతి భవనాల నిర్మాణాల్లో జరుగుతున్న దోపిడీ, డీఎస్సీ పేపర్ లీకేజీలపై ఆయన ప్రభుత్వానికి పలు డిమాండ్లు గుప్పించారు.

గత రెండేళ్లుగా అమరావతి భవనాల నిర్మాణాల పేరుతో అధికార పార్టీ నేతలు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని వైవీ ఆరోపించారు. రాజధాని భవనాల నిర్మాణాల్లో సాధారణం కంటే దాదాపు 3 నుంచి 4 రెట్లు అదనంగా ఖర్చు చూపిస్తున్నారు. చదరపు అడుగుకు ఏకంగా రూ.20,500 చొప్పున అంచనాలు వేసి భారీగా దోచుకుంటున్నారు అని ఆయన మండిపడ్డారు. ఇంతటి భారీ వ్యయం వెనుక పెద్ద ఎత్తున అవినీతి దాగి ఉందన్నది స్పష్టమవుతోందని దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ పరీక్షల పేపర్ లీకేజీలపై వైవీ సుబ్బారెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగులు ఎంతో కష్టపడి చదువుతుంటే, పేపర్లు లీక్ చేసి వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిరుద్యోగుల జీవితాలతో ముడిపడి ఉన్న డీఎస్సీ పేపర్ లీకేజీ ఉదంతం, అలాగే స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్ల కుంభకోణంపై తక్షణమే కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) చేత గానీ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత గానీ సమగ్ర విచారణ జరిపించాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -