- Advertisement -

రష్మికను కాపాడిన కృతి సనన్..!

- Advertisement -

బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘కాక్‌టెయిల్ 2’. హోమి అడజానియా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా జూన్ 19న థియేటర్లలోకి రానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా శనివారం ఈ ముగ్గురు నటీనటులు పుణెలోని ఒక మాల్‌ను సందర్శించారు. అయితే, వారిని ఒక్కసారిగా చూసేందుకు అభిమానులు ఎగబడటంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది.

అభిమానులు బారికేడ్లను దాటి మరీ ముందుకు రావడంతో అక్కడ స్వల్ప తొక్కిసలాట జరిగింది. దీంతో నిర్వాహకులు కార్యక్రమాన్ని కొద్దిసేపు నిలిపివేయాల్సి వచ్చింది. ఈ గందరగోళంలో షాహిద్ కపూర్ అసహనానికి గురవ్వగా.. అటు రష్మిక మందన్న కూడా భయాందోళనకు గురయ్యింది. ఆ సమయంలో రష్మికను అభిమానుల తాకిడి నుంచి కృతి సనన్ చాలా జాగ్రత్తగా, ఒక సోదరిలా పక్కకు తీసుకెళ్లి కాపాడింది. ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రష్మికను కృతి సనన్ రక్షించిన తీరు చూసి నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరోవైపు, ఈ ఘటనపై సోషల్ మీడియాలో విమర్శలు కూడా వస్తున్నాయి. సెలబ్రిటీల భద్రత విషయంలో నిర్వాహకుల వైఫల్యంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతమంది స్టార్స్ వచ్చినప్పుడు సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల నటీనటులకు ఇది భయానక అనుభవమని, అభిమానులు కూడా ఇలా ప్రవర్తించడం సరికాదని పలువురు కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా, ఈ ప్రమోషనల్ ఈవెంట్ ఇప్పుడు ‘కాక్‌టెయిల్ 2’ సినిమా కంటే కూడా అక్కడ జరిగిన హంగామా వల్లే వార్తల్లో నిలిచింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -