- Advertisement -

అరెస్ట్‌లే ‘రెడ్ బుక్’ రాజ్యాంగమా?

- Advertisement -

టీడీపీ ప్రభుత్వ తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన అరెస్టే లక్ష్యంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో నడుస్తున్న పాలన పూర్తిగా ‘రెడ్ బుక్’ రాజ్యాంగం ప్రకారం సాగుతోందని….ప్రతిపక్ష నాయకులను వేధించడమే ధ్యేయంగా పెట్టుకున్నారని ఆయన మండిపడ్డారు.

ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ….ప్రభుత్వం తనపై పెట్టిన కేసులు పూర్తిగా అక్రమమైనవని మరియు రాజకీయ ప్రేరేపితమైనవని స్పష్టం చేశారు. కేవలం రాజకీయంగా తనను అణగదొక్కడానికే తప్పుడు ఆరోపణలతో ఈ విధమైన చర్యలకు పూనుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల కాలంలో తాను నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసమే నిబద్ధతతో పనిచేశానని, చట్టవ్యతిరేక పనులకు ఎప్పుడూ తావివ్వలేదని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను భయాందోళనలకు గురిచేయడమే పనిగా పెట్టుకుందని బ్రహ్మనాయుడు విమర్శించారు. పోలీసు యంత్రాంగాన్ని అధికార పార్టీ తమ స్వార్థ ప్రయోజనాల కోసం మరియు రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడానికి వాడుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి బెదిరింపులకు, అక్రమ అరెస్టులకు తాను భయపడే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు.

న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని, ఈ అక్రమ కేసులను చట్టపరంగానే ఎదుర్కొని తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారని…భవిష్యత్తులో వారికి తగిన గుణపాఠం చెబుతారని బొల్లా బ్రహ్మనాయుడు హెచ్చరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -