- Advertisement -

రాజధానిలో పోలీసుల రాకెట్..జగన్ సంచలనం

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో పోలీసుల వేధింపుల తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడిన ఎమ్మార్పీఎస్ (MRPS) రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు కుమారుడు పేరపోగు క్రాంతి కుమార్ కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం పరామర్శించారు. విజయవాడలోని బాధితుడి నివాసానికి వెళ్లిన జగన్.. క్రాంతి కుమార్ చిత్రపటానికి నివాళులర్పించి, అతని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం మరియు పోలీసు వ్యవస్థపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

క్రాంతి కుమార్ నివాసంలో పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. క్రాంతికుమార్ ఇంటికి పరామర్శకు వెళ్లినపుడు అత్యంత హృదయవిదాకరమైన పరిస్థితిని చూశా. ట్యాక్సీ నడుపుకుంటూ ముగ్గురు పిల్లలతో ఒక చిన్న ఇంట్లో బతుకుతున్న పేద కుటుంబం అది. అలాంటి సామాన్య వ్యక్తిని పోలీసులు రోజూ స్టేషన్‌కు పిలిపించి మానసికంగా, శారీరకంగా వేధించి, చివరకు ఆత్మహత్య చేసుకునేలా చేశారంటే.. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంతకు దిగజారిపోయిందో స్పష్టంగా అర్థమవుతోంది అని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు నిరంతర వేధింపుల వల్లే క్రాంతి కుమార్ బలవన్మరణానికి పాల్పడ్డాడని ఆయన ఆరోపించారు.

రాజధాని విజయవాడలోనే శాంతిభద్రతలు మచ్చుకైనా కనిపించడం లేదని వైఎస్ జగన్ విమర్శించారు. అందరూ ఇక్కడే ఉంటారు.. ముఖ్యమంత్రి నుంచి సీపీ (పోలీస్ కమిషనర్), డీజీపీ, హోంమినిస్టర్‌.. అందరూ కళ్లెదుటే ఉంటారు. ఈ ఘటన జరిగిన కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ కూడా నేరుగా సీపీ పరిధిలోకే వస్తుంది. అయినాసరే ఇంత ఘోరం జరిగింది. కొడుకు చనిపోతూ ఇచ్చిన మరణవాంగ్మూలాన్ని స్వయంగా తండ్రి వెళ్ళి చూపించినా సరే.. ఉన్నతాధికారులు పట్టించుకోని దారుణమైన పరిస్థితి నేడు రాష్ట్రంలో ఉంది అని జగన్ మండిపడ్డారు.

ఈ కేసులో నిజాలు బయటకు రాకుండా అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ.. సీఐ నుంచి ముఖ్యమంత్రి దాకా ఒకరిని ఒకరు ప్రొటెక్ట్‌ చేసుకుంటూ అందరూ కలిసి లిటరల్‌గా రాజధానిలో ఒక పెద్ద రాకెట్‌ నడుపుతున్నారు. కేసును నీరుగార్చడానికి ఆధారాలను సైతం మాయం చేస్తున్నారు అని వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -