మావిగన్ మా నినాదం.. వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి..మావిగన్ అజెండాతోనే ఎన్నికలకు వెళ్తాం అన్నారు మాజీ సీఎం జగన్. మీడియాతో మాట్లాడిన జగన్.. మావిగన్ కు మేం కట్టుబడి ఉన్నాం. ప్రజల మద్దతు ఎవరికి ఉందో చూసుకుందాం. ఎన్నికల్లో అమరావతో..మావిగనో తేల్చుకుందాం అని పిలుపునిచ్చారు.
విలన్లు ఎక్కడో సినిమాల్లో ఉండరు.. చంద్రబాబు నాయుడు రూపంలో ఇక్కడే కనిపిస్తున్నారు..ఇలాంటి పనులు సినిమాల్లో చూస్తాం కానీ, మనం రియల్ గా చూస్తున్నాం అన్నారు. రెండేళ్ల క్రితం వరకు ప్రతి ఇంట్లో సంక్షేమం, విద్యా, వ్యవసాయం, ప్రజలకు జరిగిన మంచిపై చర్చ జరిగేది… కానీ, చంద్రబాబు వచ్చాక రెడ్‌బుక్ రాజ్యాంగం, కస్టోడియల్ డెత్స్, చంపేసి శవాన్ని మాయం చేయడం.. సూపర్ సిక్స్ మోసాలు, అబద్ధాలు, టాపిక్ డైవర్షన్స్‌పై చర్చ జరుగుతోంది అన్నారు.
రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా కాదు.. రూల్ ఆఫ్ ఫియర్ రాజ్యం ఏలుతోంది…పోలీస్ స్టేషన్లకు వెళ్లాలంటే ప్రజలు భయపడే పరిస్థితి తీసుకువచ్చారు అన్నారు. కస్టడీ తీసుకొని, టార్చర్ చేసి, సీసీ ఫుటేజీ మాయం చేసి, చివరి ఆ తల్లికి బూడిద కూడా ఇవ్వని దారుణం… ఇదంతా సో కాల్డ్ స్టేట్ హెడ్ క్వాటర్‌లో జరిగింది ..ఇదంతా ప్రశ్నిస్తే మీరు రౌడీలకు మద్దతు చేస్తారా అని ఎదురుదాడి చేయడమే కాకుండా.. ఎల్లో మీడియాలో రాతలు రాయిస్తున్నారు అన్నారు.
చంద్రబాబుకు, ఆయన పార్టనర్‌కు నా ప్రశ్న..ఈ రాష్ట్రంలో చట్టం, న్యాయం లేదని, కోర్టులతో తమకు పనిలేదని, దొంగ కేసులు పెడతామని, చివరికి బూడిద కూడా ఇవ్వము అని అధికారిక ప్రకటన చేయగలరా? అని ప్రశ్నించారు. సీఐని సీపీ కాపాడుతాడు..సీపీని డీజీపీ కాపాడుతాడు..డీజీపీని చంద్రబాబు కాపాడుతాడు..
ఇదే రాష్ట్రంలో కుప్పకూలిపోయిన వ్యవస్థకు సాక్ష్యాలు అన్నారు.
నిజంగా ఎన్టీఆర్ బతికి ఉండి.. చంద్రబాబును ప్రశ్నిస్తే.. ఆయన్ను కూడా రౌడీ షీటర్ అనేవాళ్లు వీళ్లు..ఎన్టీఆర్ అయినా, లక్ష్మీపార్వతి అయినా అంతే..పోలీస్ స్టేషన్‌లో సీసీ ఫుటేజీ లేదు అనుకుందాం…రైల్వే స్టేషన్, బస్టాండ్, రోడ్ జంక్షన్‌లో ఉన్న పుటేజ్ చూడొచ్చుగా..ఇంకొంచెం ముందుకెళ్తే.. సీఐ ఫోన్లు చెక్ చేయవచ్చుగా, అది లేదు. నిన్న కానిస్టేబుళ్లు ఆర్థిక ఇబ్బందుల వల్ల నాగపూర్‌లో ఫోన్లు అమ్ముకున్నారంట అని ఆరోపించారు జగన్.
