- Advertisement -

మెటాపై కేంద్రం ఉక్కుపాదం..

- Advertisement -

ఇన్‌స్టాగ్రామ్‌ ప్లాట్‌ఫామ్‌పై పిల్లల లైంగిక శోషణ మరియు వేధింపులకు సంబంధించిన పెయిడ్ అడ్వర్టైజ్‌మెంట్లు (డబ్బులు చెల్లించి ఇచ్చే ప్రకటనలు) ప్రత్యక్షమవడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సోషల్ మీడియా దిగ్గజం ‘మెటా’కు కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. అటువంటి వివాదాస్పద ప్రకటనలను, కంటెంట్‌ను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.

ఇలాంటి చట్టవిరుద్ధమైన కంటెంట్ ప్లాట్‌ఫామ్‌పైకి ఎలా వచ్చింది? భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అనే అంశాలపై ఏడు రోజుల్లోగా సమగ్ర వివరణ ఇవ్వాలని కేంద్రం మెటాను ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని అత్యంత తీవ్రమైన అంశంగా పరిగణించింది. కేవలం ప్రకటనలను తొలగించడమే కాకుండా, వాటి వ్యాప్తిని అడ్డుకోవడానికి తక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లోని కొన్ని పెయిడ్ ప్రకటనల ద్వారా వినియోగదారులను చైల్డ్ అబ్యూస్ కంటెంట్ ఉండే ఇతర బాహ్య ప్లాట్‌ఫామ్‌ల వైపు మళ్లిస్తున్నట్లు నివేదికలు వచ్చాయి.

ఈ కంటెంట్ ఎక్కువ మందికి కనిపించేలా దోహదపడిన “అల్గారిథమ్ యాంప్లిఫికేషన్” విధానంపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ప్రత్యేకంగా కోరింది. గడువులోగా మెటా సరైన వివరణ ఇవ్వకపోయినా లేదా తగిన చర్యలు తీసుకోకపోయినా చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నోటీసులో హెచ్చరించింది.

బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (BBC) పరిశోధనాత్మక నివేదిక వెలువడిన కొన్ని గంటల్లోనే కేంద్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ యొక్క మోడరేషన్ ప్రక్రియను దాటుకుని మరీ భారతదేశంలో ఈ చైల్డ్ అబ్యూస్ ప్రకటనలు ప్రదర్శితమయ్యాయని బీబీసీ తన నివేదికలో పేర్కొంది.బీబీసీ వరల్డ్ సర్వీస్ పరిశోధన ప్రకారం.. కొన్ని ప్రకటనలలో “రేప్ వీడియో”, “చైల్డ్ వీడియో” వంటి పదాలు ఉన్నాయి. ఇవి వినియోగదారులను నేరుగా టెలిగ్రామ్ (Telegram) ఛానళ్లకు లింక్ చేశాయి. అక్కడ కేవలం రూ. 99 లకే అటువంటి చట్టవిరుద్ధమైన వీడియోలను విక్రయిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.

ఈ నివేదికపై స్పందించిన మెటా సంస్థ.. సదరు ప్రకటనలను వెంటనే తొలగించామని, వాటిని పోస్ట్ చేసిన అకౌంట్లను సస్పెండ్ చేశామని తెలిపింది. వీటికి సంబంధించిన పలు యూఆర్ఎల్స్ (URLs) కూడా బ్లాక్ చేశామని, నిబంధనలను ఉల్లంఘించే ప్రకటనలను గుర్తించడానికి ఆటోమేటెడ్ వ్యవస్థలను వాడుతున్నామని పేర్కొంది. పిల్లలపై లైంగిక వేధింపులను ప్రోత్సహించే కంటెంట్‌పై తాము కఠిన చర్యలు తీసుకుంటున్నామని టెలిగ్రామ్ తెలిపింది. ఇందులో భాగంగా 2026 సంవత్సరంలో ఇప్పటివరకు ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న 2.74 లక్షలకు పైగా ఛానళ్లు మరియు గ్రూపులను తొలగించినట్లు సంస్థ స్పష్టం చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -