- Advertisement -

నువ్వు చావకపోతే.. పెళ్లి చెడగొడతా!

- Advertisement -

విజయనగరం జిల్లా గరివిడి మండలం తోండ్రంగి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. తన వివాహ నిశ్చితార్థం జరగాల్సిన సమయంలో, వివాహితుడైన ఒక వ్యక్తి వేధింపులు భరించలేక 22 ఏళ్ల అఖిల అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది.

తోండ్రంగి గ్రామానికి చెందిన అఖిలకు, అదే గ్రామానికి చెందిన రాము నాయుడుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే, రాము నాయుడు అప్పటికే వివాహితుడు. ఈ క్రమంలో అఖిలకు కుటుంబ సభ్యులు మరో వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిర్చి, గురువారం నిశ్చితార్థం నిర్ణయించారు.

ఈ విషయం తెలుసుకున్న రాము నాయుడు అఖిలను బెదిరించడం మొదలుపెట్టాడు. “నువ్వు చావకపోతే మన ప్రేమ విషయం బయటపెట్టి, ఈ పెళ్లి చెడగొడతాను” అని ఆమెను బ్లాక్‌మెయిల్ చేశాడు. అంతేకాకుండా, మంగళవారం ఆమెకు బలవంతంగా పురుగుల మందు ఇచ్చాడు. అతను చెప్పినట్లే చేయడంతో అఖిల పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి అఖిల మృతిచెందింది.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే అఖిల తన మరణానికి గల కారణాలను పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు రాము నాయుడుపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. తనను బ్లాక్‌మెయిల్ చేసి ప్రాణం తీసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని అఖిల కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. గరివిడి ఎస్సై లోకేశ్వరరావు కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -