- Advertisement -

వైసీపీ బీసీ నేతల సమరశంఖం..

- Advertisement -

వైసీపీ బీసీ నేతలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వం బీసీ వర్గాలకు ఇచ్చిన హామీలు అమలు చేయటం లేదని మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీకి చెందిన బీసీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చి బీసీలతో ఓట్లు వేయించుకున్న కూటమి నేతలు అమలులో విస్మరించారని మండిపడ్డారు. బీసీలకు మద్దతుగా విజయవాడలో బీసీల సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లాల వారీగా కార్యక్రమాలను ఖరారు చేసారు.

వైసీపీ బీసీ నేతలు సమరశంఖం పూరించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి కావటం తో బీసీ వర్గాలకు ఇచ్చిన హామీల పైన పార్టీ నేతలు చర్చించారు. ఫీజు రీబంబర్స్ మెంట్.. పెన్షన్ పెంపు మొదలు అనేక హామీలు విస్మరించారని మండిపడ్డారు. దీంతో వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల ని నిర్ణయించారు. ఇందు కోసం విజయవాడ వేదికగా సభ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలో బీసీల సభ ఏర్పాటు చేసి ప్రజలకు చంద్రబాబు మోసాల్ని వివరిస్తామని నేతలు ప్రకటించారు. రెండేళ్ల కూటమి పాలనలో బలహీనవర్గాలపై జరుగుతున్నాయని పార్టీ నేతలు ఆరోపించారు. బీసీలకు చంద్రబాబు ఏం చెప్పారు, ఎలా మోసం చేశారన్న దానిపై జనాలకు వాస్తవాలు వివరించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. వచ్చే నెలలో విజయవాడ నగరంలో వైయ‌స్ఆర్‌సీపీ బీసీ నేతలంతా ఓ సమావేశం ఏర్పాటు చేసుకుని కార్యాచరణ ఖరారు చేయాలని డిసైడ్ చేసారు.

విజయవాడ సభతో పాటుగా జోనల్ వారీగా ఈ కార్యాచరణ ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో బలహీన వర్గాలంతా ఒక్కటే, అంతా ఒక్క తాటిపైకి వచ్చి బలవంతులుగా మారి శక్తివంచన లేకుండా పోరాడే విధంగా వరుసగా సమావేశాలు నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి జోగి రమేశ్ ప్రకటించారు. 2014-19 మధ్య చంద్రబాబు తన పాలనలో బీసీ అయిన కేఈ కృష్ణమూర్తిని డిప్యూటీ సీఎంగా కొనసాగించారని.. తమ ప్రభుత్వ హయాంలో బీసీలతో పాటు మొత్తం ఐదు వర్గాలకు డిప్యూటీ సీఎంలుగా పదవులు ఇచ్చారని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు చంద్రబాబు రెండేళ్లుగా బీసీ వర్గానికి ఎందుకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వకపోవడం వెన్నుపోటు కాదా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలకూ, అమలుకూ ఏమాత్రం పొంతన లేదని పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రశ్నించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం వల్ల బీసీ వర్గాలు ఏ విధంగా నష్టపోతున్నాయని, వారికిచ్చిన హామీలకు ఎందుకు తిలోదకాలు ఇచ్చారని మండిపడ్డారు. ఇక తరచూ బీసీ నేతలు సమావేశం కావాలని నిర్ణయించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -