- Advertisement -

పవన్‌పై రాజద్రోహం కేసు పెట్టరా?

- Advertisement -

గతంలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడో.. రావణ్ కూడా అదే మాట్లాడాడు అన్నారు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు నారాయణ. పవన్ కళ్యాణ్ చెప్పు చూపించాడు.. రావణ్ చూపించలేదు అంతే తేడా.. దీనిపైన పోలీసులు రకరకాల కేసులు మోపి అరెస్టు చేశారు, జైల్లో పెట్టారు. బెయిల్ రాగానే మళ్లీ అరెస్ట్ చేస్తున్నారు అని మండిపడ్డారు.

ప్రశ్న రావణ్ ని ఉపా చట్టం (రాజ‌ద్రోహం) కింద అరెస్ట్ చేశారు… ఇటీవల మహారాష్ట్రలో మోడీ డౌన్ డౌన్, అమిత్ షా డౌన్ డౌన్ అన్న వాళ్లపై కేసులు పెట్టారు..
మహారాష్ట్రలో జస్టిస్ మాధవ్ దీనిపై తీవ్రంగా స్పందించారు అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు ఉందని, డౌన్ డౌన్ అని నిరసన తెలియజేస్తే అరెస్టు చేస్తారా, ఇదేమన్నా నిరంకుశ ప్రభుత్వమా అని జస్టిస్ హెచ్చరించారు .

ఈ ప్రభుత్వ హయాంలో ఏకంగా శవాన్ని మాయం చేసి చివరికి బూడిద కూడా లేకుండా చేశారు…దీనిని బట్టి అధికారంలో ఉన్న పాలకులకు పోలీసులు వత్తాసు పలుకుతున్నది …ఇది మంచి పద్ధతి కాదు. చట్టపరమైన చర్యలు ఉండాలే గాని, క‌క్షపూరిత వైఖరి తగదు అన్నారు. రాజ్యాంగానికి, న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా చంద్ర‌బాబు ప్రభుత్వం వ్యవహరించడం సరైనది కాదు అన్నారు సీపీఐ నారాయణ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -