- Advertisement -

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. సెప్టెంబర్ నెలలో దశలవారీగా ఎన్నికలు నిర్వహించే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ముందుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయిన అనంతరం జడ్పీటీసీ (ZPTC), ఎంపీటీసీ (MPTC) ఎన్నికలను నిర్వహించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

తదుపరి దశలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను దశలవారీగా పూర్తి చేసి గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు కొత్త పాలకవర్గాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

ఎన్నికల నిర్వహణకు అవసరమైన పరిపాలనా ఏర్పాట్లు, ఓటరు జాబితాల సవరణ, రిజర్వేషన్ల ఖరారు, ఎన్నికల షెడ్యూల్ వంటి అంశాలపై సంబంధిత శాఖలు ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

అయితే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘంతో సంప్రదింపులు జరిపిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -