- Advertisement -

జగన్ ట్రేడ్‌మార్క్ డైలాగ్‌..ఉత్సాహం!

- Advertisement -

భీమవరం ఆక్వా రైతుల సభలో వైసీపీ అధినేత జగన్ తన ట్రేడ్‌మార్క్ డైలాగ్‌తో అభిమానుల్లో ఉత్సాహం నింపారు. ఇష్టానుసారంగా ఫీడ్ ధరలు పెంచుతూ కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులను నట్టేట ముంచుతోందని ఆయన ధ్వజమెత్తారు. “సీఎం చంద్రబాబు ట్రాన్స్‌ఫార్మర్ ధరలు కూడా తగ్గిస్తానన్నారు.. మరి తగ్గించారా? గట్టిగా ఇలా.. ఇలా.. ఇలా.. అనండి” అంటూ జగన్ వ్యాఖ్యానించారు.

ఫిష్ మీల్ లభ్యత ఆధారంగా ధరలను సమీక్షించాలని, ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచవద్దని వైసీపీ అధినేత జగన్ కోరారు. ఆక్వా సమస్యలపై ప్రభుత్వానికి గడువు ఇచ్చామన్నారు. చంద్రబాబు చర్మం మందమని, దున్నపోతు మీద వర్షం పడినట్లు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో సీఎం చంద్రబాబు సానుభూతిపరుల సిండికేట్ రాజ్యమేలుతోందని, వారి చేతుల్లో రైతుల బతుకులు నలిగిపోతున్నాయని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. బాబు అధికారంలోకి రావడం సిండికేట్‌కు పండగైతే, రైతన్నలకు కన్నీళ్లే మిగిలాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -