- Advertisement -

పార్లమెంట్ వ్యూహంపై ఎంపీలతో జగన్‌ ‘కీ’ భేటీ!

- Advertisement -

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నేడు పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనుంది. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు పాల్గొననున్నారు.

త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ముందు రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను ఎలా ప్రస్తావించాలి, ప్రజా సమస్యలను ఏ విధంగా పార్లమెంట్‌లో వినిపించాలనే దానిపై ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.

అలాగే ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పెండింగ్ హామీలు, నిధుల కేటాయింపులు, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు, విభజన హామీల అమలు వంటి అంశాలను పార్లమెంట్‌లో బలంగా ప్రస్తావించేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

పార్లమెంట్ సమావేశాల్లో ప్రజల సమస్యలను సమర్థవంతంగా లేవనెత్తడంతో పాటు రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు పార్టీ ఎంపీలు ఏకాభిప్రాయంతో పనిచేయాలని ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -