- Advertisement -

శ్రీమంతుడిని ఫాలో అవుతున్న రెజీనా..!

- Advertisement -

హీరోయిన్ రెజీనా ఏ హీరోయిన్ చేయని సాహసం చేసింది. ఏకంగా 200కి.మీ. సైకిల్‌ తొక్కి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

అయితే ఇది కేవలం వికలాంగులైన అథ్లెట్ల కోసమేనని, తనేదో రికార్డ్ నెలకొల్పడం కోసం కాదని చెప్తోంది. కర్నూల్‌ నుంచి జడ్చర్ల వరకు దాదాపు రెండు వందల కిలో మీటర్ల మేర సైకిల్ యాత్ర  చేసింది. వికలాంగుల కోసం నా వరకు ఎంత వీలైతే అంత కృషి చేస్తానని పేర్కొంది. బెంగుళూరు నుంచి కొంతమంది పారా అథ్లెట్లు చేపట్టిన యాత్ర కర్నూలుకు చేరుకుంది.

అక్కడి నుంచి వారితో రెజీనా కలిసి జడ్చర్ల వరకు యాత్రను కొనసాగించింది. ఈ నెల 14వ తేదీ రాత్రి కర్నూల్ నుంచి మొదలైన రెజీనా సైకిల్ యాత్ర ఆ మరుసటి రోజు మార్నింగ్‌ కి జడ్చర్లకు చేరుకుందట. ఇలా వికలాంగుల కోసం  రెండు వందల కిలో మీటర్ల మేర చేసిన యాత్రకు ఇండస్ట్రీలో రెజీనాకు మంచి పేరు తెచ్చి పెట్టిందట. అందరూ ఆమె వారి కోసం పడుతున్న తీరును చూసి హ్యాట్సాఫ్ రెజీనా అంటున్నారని సమాచారం.  

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -