” డబ్బు ” ఎంతటి దారుణానికైనా ఓడిగడుతుంది, సొంత వ్యక్తుల మధ్య దూరమే కాకుండా దారుణాలకి కూడా ఈ డబ్బు ఆయుధంగా పనిచేస్తుంది. నెల్లూరు జిల్లాలో సొంత మనవడు తన తాత గొంతుకోసి చంపేసాడు. కేవలం డబ్బుల కోసం (ఆస్తి) ఇదంతా జరిగింది.
కేవలం లక్ష రూపాయల విలువ ఉన్న భూమిని తనకి ఇమ్మని అడిగిన మనవడికి తాత ఇవ్వలేదు అన్న కారణంతో ఈ పరిస్థితికి దిగజారాడు ఆ మనవడు. ముత్తంగ క్రిష్నయ్య కృష్ణా జిల్లా సైదా పురం లో ఉంటాడు అరవై ఐదేళ్ళ కృష్ణయ్య లక్ష రూపాయల విలువ చేసే స్థలం ఉంది ఆ స్థలం తనకి ఇవ్వాలి అని ఇరవై రెండేళ్ళ మనవడు కోరగా తాత ఇవ్వడం లేదు. కొన్నాళ్ళు ఆగి ఇస్తా కొన్నాళ్ళు ఆగి ఇస్తా అంటూ చెబుతుంటే తాత కి అసలే అనారోగ్యం కావడం తో ఎప్పుడు పోతాడో తెలియని సందర్భం లో ఎలాగైనా ఆస్తి దక్కించుకోవాలి అని శివ ఆలోచించాడు. బహిర్భూమి కి వెళ్ళిన తాతని ని అక్కడే నిలదీసి ఆస్తి ఇస్తావా చస్తావా అంటూ బెదిరించాడు. సొంత మనవాడే అలా చెయ్యడం తో ఆశ్చర్యపోయిన క్రిష్నయ్య కోపం తో మనవడి మీద దాడికి దిగాడు ఈ నేపధ్యం లో తనతో తెచ్చుకున్న కత్తి తో శివ తాత మీద దాడి చేసి గొంతు కోసి చంపేసాడు. పోలీసులకి ఊర్లో వారు సమాచారం ఇవ్వడం తో అక్కడికి చేరుకొని శివ కోసం గాలిస్తున్నారు.
