తెలంగాణా సచివాలయం అంటే రాష్ట్రం మొత్తానికి పరిపాలనా కేంద్రం. అక్కడినుంచే పరిపాలన అంతా కొనసాగుతోంది. అక్కడినుంచే చట్టాలు, జవోలు అన్ని అమలులోకి వస్తాయి. మరి అటువంటి సచివాలయం అనగానే ఫుల్ సెక్యూరిటీ జోన్ లో ఉంటదని తెలుసు కదా? అయితే ఇప్పుడు సచివాలయం కాస్త సెక్యూరిటీ జోన్ లో కాకుండా డేంజర్ జోన్ లో ఉన్నది. సచివాలయం ఏంటి డేంజర్‌జోన్‌లో ఉందనుకుంటున్నారా..? అయితే ఈ వీడియో చూడండి.
నెక్లెస్ రోడ్డులోని సెక్రెటరేట్ ముందు ఓ వాహనదారుడు అదుపు తప్పి గుంతలో పడ్డాడు. భూగర్భ డ్రైనేజి కోసం గుంతలు తొవ్వుతున్న అధికారులు.. ఆ గుంతను అలాగే నిర్లక్షంగా వదిలివేశారు. దీంతో అటుగా వెళ్తున్న ఓ వాహనదారుడు బండి తో సహా అందులో పడిపోయాడు. అక్కడే ఉన్న స్థానికులు గుర్తించి ఆయన్ని రక్షించి హాస్పిటల్ కు తరలించారు.
అయితే ఈ సంఘటన రెండు రోజుల క్రితం జరిగింది. బాధితుడిని రక్షించే వీడియో తాజాగా వెలుగులోకి రావడంతో ఇప్పుడ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సచివాలయం ముందు గుంత.. పడిపోయిన బాధితుడి వీడియోను మీరు చూడండి.
