హిందూపూర్ ఎమ్మెల్యే , నందమూరి నటసింహం బాలకృష్ణ నిన్న తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ని కలిసి అందరినీ ఆశ్చర్యపరిచారు. స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ప్రార్ధన చెయ్యడం కోసం పోలీసులు అభ్యంతరం చెప్పడంతో ఆయన నేరుగా ముఖ్యమంత్రి ని కలిసి ఫిర్యాదు చేసారు అని మొదట న్యూస్ వచ్చింది కానీ.
అక్కడికి వెళ్ళిన తరవాత మాత్రం ఒకరికి ఒకరు కరచాలనం చేసుకుని, సినిమాల గురించీ, ఇతరత్రా ముచ్చట్లూ మాట్లాడుకున్నారు. వారివురి చెప్పుకొన్న ముచ్చట్లు, షేక్ హ్యాండ్ ఇచ్చుకొంటూ దిగిన ఫోటోలు మీడియాలో, వెబ్ సైట్లలో విసృతంగా ప్రత్యక్షమయ్యాయి.
ఎన్టీఆర్ ఘాట్ వద్దన పోలీసులు అవరోధాలు సృష్టించడం తో టీడీపీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్, రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి నరసింహులు తదితర తెదేపా నేతలు నిరసన తెలుపుతూ ఉన్న సమయంలో బాలయ్య కెసిఆర్ దగ్గరకి ఆవేశంగా వెళ్లి నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇవ్వడం తో తెలుగు తమ్ముళ్ళు షాక్ తిన్నారు.
ఒక పక్క కెసిఆర్ మీదా ఆయన ప్రభుత్వం మీదా గ్రేటర్ ఎన్నికల పరిథి లో బురద జల్లచ్చు అని ప్లాన్ చేసిన తెలుగు తమ్ముళ్ళకి బాలకృష్ణ ఒక రేంజ్ లో షాక్ ఇచ్చినట్టు అయ్యింది. తెరాస ప్రభుత్వం స్వర్గీయ ఎన్టీఆర్ పట్ల అవమానకరంగా వ్యవహరించిందని గట్టిగా చెప్పుకొనే మంచి అవకాశం దక్కింది. మాగంటి గోపీనాద్ తదితరులు అక్కడ ధర్నా చేసారు కూడా. కానీ బాలకృష్ణ వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసి ముచ్చట్లు చెప్పుకొని, ఆయనతో ఫోటోలు దిగడంతో తెరాసకు అనుకూల వాతావరణం సృష్టించినట్లయింది.
