- Advertisement -

తేజాకు మళ్లీ పిలుపు?

- Advertisement -

నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో బాలకృష్ణ ‘ఎన్టీఅర్’ బయోపిక్ చేయాలనుకున్నాడు. ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్నో నెలలుగా పని చేసిన దర్శకుడు తేజ సడెన్ గా బయటకు వచ్చేసాడు. అతడికి బదులుగా మరో దర్శకుడిని తీసుకోవాలని భావించిన చిత్రబృండానికి నిరాశే ఎదురైంది. సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడంతో ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్లో బయోపిక్‌లపై ఆసక్తిపెరిగింది. త్వరలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఈ ఎన్టీఆర్ బయోపిక్ మూవీ ఎలాంటి ప్రభావం చూపనుందనే ఆసక్తి సినీ, రాజకీయ వర్గాల్లో ఉంది.

ఎన్టీఆర్ బయోపిక్ మూవీపై తొలినుండి గ్రౌండ్ వర్క్ చేసిన దర్శకుడు తేజను కాదని వేరే డైరెక్టర్‌ను ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకురావడం అంత ప్రయోజనకరం కానదే అభిప్రాయంలో ఉన్నారట బాలయ్య అండ్ కో. కొత్త దర్శకుల వేటను పక్కన పెట్టి పాత దర్శకుడికే ఎన్టీఆర్ బయోపిక్ మూవీ బాధ్యతల్ని అప్పగించారనే వార్త ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఇగో క్లాషెస్ వల్ల విడిపోయిన బాలయ్య.. తేజల రాజీ కుదిరిందని త్వరలోనే ఎన్టీఆర్ బయోపిక్ మళ్లీ పట్టాలెక్కుతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -