Sunday, May 19, 2024
- Advertisement -

2019లో ఓటమి భయంతో రౌడీ రాజకీయానికి తెరలేపారా?

- Advertisement -

2019 ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల సునీత ఓటమి ఖాయం అని చంద్రబాబు నాయుడు సర్వేలోనే తేలింది. బాబు అంచనాలకు తగ్గట్టుగానే రాప్తాడు నియోజకవర్గంలో తెదేపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైకాపా ఎప్పుడు పిలుపునిచ్చినా ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. తాజాగా జగన్ పాదయాత్రకు సంఘీభావ యాత్రగా రాప్తాడు నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జ్ తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి చేపట్టిన పాదయాత్రకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఆ తర్వాత జరిపిన బహిరంగ సభ కూడా గ్రాండ్‌గా సక్సెస్ అయింది.

వైకాపాకు దక్కుతున్న ఈ ప్రజాదరణే పరిటాల వర్గంలో వణుకు పుట్టించింది. రుణమాఫీ హామీలపై ఎక్కువ ఆశలు పెట్టుకున్నది కరువు జిల్లా అయిన అనంత రైతాంగమే. అందుకు తగ్గట్టుగానే 2014లో టిడిపికి భారీ విజయం దక్కింది. అయితే బాబు మాత్రం రుణమాఫీలతో సహా అన్ని హామీల విషయంలోనూ అనంతపురానికి మొండిచెయ్యి చూపించాడు. రాప్తాడు నియోజకవర్గానికి పరిటాల సునీత చేసింది కూడా ఏమీ లేదు. అందుకే ఇక్కడ 2019 ఎన్నికల్లో వైకాపా గెలుపు ఖాయమని సర్వేలు కూడా తేల్చిచెప్పాయి.

ఈ నేపథ్యంలోనే వైకాపా నేతలు, కార్యకర్తలపై రౌడీ రాజకీయాలకు తెగబడ్డారు పరిటాల వర్గీయులు. వైఎస్సార్సీపీ యువజన విభాగం కార్యదర్శి శంకరయ్యపై వేటకొడవళ్ళతో హత్యాప్రయత్నం చేశారు. గాయాలతో తప్పించుకున్న శంకరయ్య తన హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళ వివరాలు, పేర్లతో సహా అన్నీ చెప్తున్నప్పటికీ పోలీసులు మాత్రం పరిటాల ఇంటి వాచ్‌మేన్‌గా పనిచేస్తున్నట్టుగా కనీసం కేసు నమోదు చేసుకోవడానికి కూడా ముందుకు రావడం లేదని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు. ఈ రౌడీ రాజకీయం అయినా టిడిపిని. పరిటాల వారిని ఏ మేరకు గట్టెక్కిస్తుందో చూడాలి మరి. అనునిత్యం ప్రజాస్వామ్యం, శాంతి అంటూ ఇతరులకు ప్రవచనాలు చెప్పే చంద్రబాబు ఈ హత్యా రాజకీయాలపై ఏమని స్పందిస్తాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -