Monday, May 20, 2024
- Advertisement -

తెదేకు పవన్ దెబ్బ….. ఆరు జిల్లాల్లో 70 సీట్లలో వైకాపా

- Advertisement -

ఎన్నికల ఏడాది స్టార్ట్ అవడంతోనే రకరకాల విశ్లేషణలు, సర్వేలు వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఎలా ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ నాట మాత్రం ఎక్కువ సర్వేలు, విశ్లేషణలు వైకాపా గెలుపు ఖాయం అని తేల్చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ నాట పవన్ కళ్యాణ్ ప్రభావం ఎంత అనే విషయంపై ఇప్పుడు ఒక విశ్లేషణ బయటికొచ్చింది. అది కూడా నాలుగు జిల్లాల రాయలసీమ…..ప్రకాశం, నెల్లూరులను కూడా కలుపుకుని మొత్తం గ్రేటర్ రాయలసీమలో టిడిపిని చావుదెబ్బకొట్టనున్నాడు పవన్. పవన్ ప్రభావంతో పరిటాల సునీత లాంటి వాళ్ళకు కూడా ఈ సారి ఓటమి తప్పదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

రాయలసీమ వరకూ చూసుకుంటే 2014లో జగన్‌కి ఉన్న ఓటు బ్యాంక్‌తో పాటు ఇప్పుడు తెదేపా ప్రభుత్వ అసంతృప్త ఓటు కూడా జగన్‌కే పడుతుంది. ఇక ఇక్కడ పవన్ కళ్యాణ్‌కి సీట్లు గెలిచే స్థాయిలో ఓట్లు పడే అవకాశం లేదు. అయితే టిడిపికి సాలిడ్ ఓటు బ్యాంక్ అయిన బీసీలు, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సొంత సామాజిక వర్గం అయిన బలిజల ఓటు బ్యాంక్‌ని మాత్రం పవన్ చీలుస్తాడు. 2009లో చిరంజీవి కూడా ఈ ఓట్లను చీల్చడంతోనే చంద్రబాబు భారీగా నష్టపోయాడు. అతిపెద్ద నాయకుడు అని చెప్పుకునే పరిటాల రవి భార్య సునీత కూడా కేవలం రెండు వేల ఓట్లతో చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా బయటపడింది. ఇక ఈ సారి రుణమాఫీ హామీలతో సహా అన్ని హామీలను తుంగలో తొక్కిన చంద్రబాబుపై అనంత ఓటర్లలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాలలో కేవలం తనకు ఉన్న పట్టును జగన్ నిలుపుకున్నా చాలు…….వైకాపాకు పూర్తి ఎడ్జ్ ఇక్కడే వచ్చేస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ విశ్లేషణ ప్రకారం చూసుకుంటే మాత్రం కచ్చితంగా మొత్తం 70 సీట్లలో 80శాతంపైగా సీట్లు జగన్ సొంతం కానున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -