- Advertisement -

విలన్ గా.. డబ్బింగ్ చెప్పేదెవరో!

- Advertisement -

యాంగ్రీ యంగ్ మాన్ ఇమేజ్ పోవడంతో.. సినిమాల్లో తంటాలు పడుతున్న హీరో రాజశేఖర్.. ఇప్పుడు తేజ డైరెక్షన్ లో విలనీ పండించేందుకు రెడీ అయ్యాడని టాలీవుడ్ లో కొన్నాళ్లుగా ఓ న్యూస్ వినిపిస్తోంది.

పాత హీరోలు.. కొత్తగా కనిపించడంలో వింతేం లేదు కానీ.. పూర్తిగా డబ్బింగ్ పైనే ఆధారపడుతూ వస్తున్న రాజశేఖర్ కు.. ఇప్పుడు ఎవరి గొంతు సపోర్ట్ గా నిలవనుందన్నదే.. కాస్త ఆసక్తి కలిగిస్తోంది.

డబ్బింగ్ లేకుంటే.. రాజశేఖర్ సక్సెస్ అయ్యేవాడే కాదని చాలా మంది చెబుతుంటారు. అందుకు తగ్గట్టుగా.. కెరీర్ మొదటి నుంచి డైలాగ్ కింగ్ సాయికుమార్ డబ్బింగ్ పైనే.. రాజశేఖర్ ఆధారపడ్డాడు. పోలీస్ స్టోరీ సినిమా విడుదల తర్వాత.. సాయికుమార్ కొన్నాళ్లు రాజశేఖర్ కు డబ్బింగ్ ఆపేయడంతో.. అప్పట్నుంచే యాంగ్రీ యంగ్ మాన్ కు కష్టాలు మొదలయ్యాయి.

ఇప్పుడు.. విలనీతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి.. జగపతి బాబులా.. సుమన్ లా.. ఓ వెలుగు కోసం రాజశేఖర్ ప్రయత్నాలైతే మొదలు పెట్టినట్టే కనిపిస్తోంది. ఈ ట్రయల్ లో ఆయనకు ఎవరు గొంతు అరువిస్తారో చూడాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఓ సెలెబ్రిటీ విషయంలో.. ఆయన క్యారెక్టర్ కంటే.. డబ్బింగ్ ఎవరు చెబుతారా అన్న ఆరాటం.. వింతగా ఉంది కదా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -