- Advertisement -

సీనియర్ నటుడు వినోద్ ఇకలేరు

- Advertisement -

టాలీవుడ్ లో మళ్లీ విషాదం అలముకుంది. ప్రముఖ సీనియర్ నటుడు వినోద్ (59 ) తుదిశ్వాస విడిచారు. శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో బ్రెయిన్‌స్ర్టోక్‌తో హైదరాదాద్ లోని తన నివాసంలో కన్నుమూశారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వినోద్ అసలు పేరు ఆరిశెట్టి నాగేశ్వరరావు. పరిశ్రమకు వచ్చాక వినోద్ అని పేరు మార్చుకున్నారు. 1980లో కీర్తి కాంత కనకం సినిమాతో ఆయన సినీ రంగప్రవేశం చేశారు. 300 లకు పైగా తెలుగు సినిమాల్లో నటించారు. 30కి పైగా తమిళ, ఆరు హిందీ సినిమాల్లోనూ నటించారు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వినోద్ నటన ఆకట్టుకునేది. ఓ వైపు సినిమాల్లో బిజీగా నటిస్తూనే మరోవైపు టీవీ సీరియళ్లలోనూ నటించారు. వినోద్ కు మంచి గుర్తింపు తెచ్చిన సినిమా వెంకటేశ్ నటించిన చంటి. అందులో మీనా సోదరుల్లో ఒకడిగా చక్కని విలనిజం ప్రదర్శించారు.

ఆ సినిమా తర్వాత ఆయన కెరీర్ బాగా ఊపందుకుంది. చిరంజీవితో ‘ఇంద్ర’, బాలకృష్ణతో, ‘నరసింహనాయుడు’, ‘లారీ డ్రైవర్‌’, భైరవద్వీపం, ప్రభాస్ తో ‘మిర్చితో సహా అనేక సినిమాల్లో ఆయన నటించారు. నల్లత్రాచులో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఫ్యాక్షన్‌ సినిమాల్లో విలన్‌గా ఆయన నటకు మంచి ప్రశంసలు లభించాయి. వినోద్‌కు భార్య వీనావతి, పిల్లలు శిరీష, సురేష్‌, తేజస్విలు ఉన్నారు. 30 ఏళ్లకు పైగా సినీ పరిశ్రమలో ఉన్నవినోద్ వివాదాలకు దూరంగా ఉండేవాడని పలువురు సినీ ప్రముఖులు కొనియాడారు. ఆయన మృతిపట్ల టాలీవుడ్ ప్రముఖులంతా విచారం వ్యక్తం చేశారు. వినోద్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, 59 ఏళ్లకే సినీ పరిశ్రమ ఓ మంచి నటుడుని కోల్పోయిందని, వినోద్ లేని లోటు పూడ్చలేనిదని సంతాపం వ్యక్తం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -