ఉత్తరప్రదేశ్‌లో జరిగే నేరాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. తాజాగా అలాంటి సంఘటనే మరోకటి వెలుగులోకి వచ్చింది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసుల పిల్లలకే రక్షణలేకుండా పోతోంది. ఓ పోలీస్ ఇన్ స్పెక్టర్ కూతురిపై నలుగురు విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన కాన్పూర్‌లో చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే…కాన్పూర్ కి చెందిన ఓ పోలీస్ ఇన్ స్పెక్టర్ కుమార్తె స్థానిక కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. రోజుమాదిరే పేరెంట్స్‌కి బాయ్ చెప్పి కాలేజీకి వెళ్లింది. సాయంత్రం మాత్రం రోజూ వచ్చే టైముకి ఇంటికి రాలేదు. అంజలి తల్లి… ఆమెకు కాల్ చెయ్యగా… మొబైల్ స్విచ్ఛాఫ్ అని వచ్చింది. దాంతో ఆందోళన చెందిన తల్లి, డండ్రులు అమ్మాయి ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసింది. వాళ్లంతా అంజలీ తమతో రాలేదని చెప్పారు.
ఆమె ఆందోళనలో ఉండగానే ఇంటి డోర్ బెల్ మోగింది. వెంటనే డోర్ తీసిన తల్లి… తన కూతురు అంజలిని చూసి షాకైంది. కూతురు చెప్పిన మాటలకు తల్లి కన్నీటి పర్యంత మయ్యింది. ఆమెకు పరిచయస్థుడైన ఓ బీటెక్ విద్యార్థి.. ఆమెకు మాయమాటలు చెప్పి.. ఓ ఫ్లాట్ కి తీసుకువెళ్లాడు. అక్కడ తన మిత్రులతో కలిసి.. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
