- Advertisement -

అక్కడే.. మళ్లీ మళ్లీ భూకంపం??

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం, నెల్లూరు జిల్లాలను భూకంపం వణికిస్తోంది. పదే పదే.. ఈ రెండు జిల్లాల్లోనే భూ ప్రకంపనలు వస్తుండడంతో.. ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో అర్థం కాక.. టెన్షన్ పడుతున్నారు. ప్రకాశం జిల్లాలోని పామూరు, పీఎస్ పురం మండలాల్లో స్వల్పంగా భూమి కంపించడంతో మళ్లీ ఈ విషయం చర్చలోకి వచ్చింది.

అంతా ప్రశాంతంగా ఉంది అనుకుంటున్న సమయంలో.. ఒక్కసారిగా భూమి కుదుపునకు గురవుతుండడంతో.. ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతోంది. ఇలా.. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనే ఎందుకు జరుగుతోందో అన్న చర్చ కూడా ఊపందుకుంటోంది. ప్రభుత్వం ఈ విషయంలో త్వరగా నిపుణులతో ఏదో ఒక విషయం తేల్చేలా చేసి.. ప్రజల భద్రతకు చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉందన్న వాదన పెరుగుతోంది.

వరుస భూకంపాలకు కారణాలు అన్వేషించి.. జనంలో అవగాహన పెంచాల్సింది ప్రభుత్వమే అన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే.. ప్రకృతి విపత్తుల విషయంలో.. సడన్ గా వచ్చే ఇలాంటి ఉపద్రవాల విషయంలో.. ప్రభుత్వం కూడా ఉన్నట్టుండి ఎలా స్పందించగలుగుతుందన్న వాదన కూడా వినిపిస్తోంది. మరి.. జనంలో ఆందోళన పెంచుతున్న ఈ విషయంలో.. సర్కార్ స్పందన ఎలా ఉంటుందన్నది.. చర్చనీయాంశంగా మారుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -