- Advertisement -

“ఇద్దరిలోకం ఒకటే” మూవీ రివ్యూ

- Advertisement -

రాజ్ తరుణ్ హిట్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజా రాజ్ తరుణ్ హీరోగా జి ఆర్ కృష్ణ దర్శకత్వంలో షాలిని పాండే హీరోయిన్ గా తెరకెక్కించిన మరో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ’ఇద్దరి లోకం ఒక్కటే’. ఈ సినిమా ఈ రోజే రిలీజ్ అయింది. ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ :

చిన్నప్పుడే విడిపోయిన హీరో, హీరోయిన్ మళ్లీ పాతికేళ్ల తర్వాత ఊహించని పరిణామాల మధ్య కలుసుకుంటారు. వీరిద్దరు ప్రేమలో పడిపోతారు. మళ్లీ విడిపోతారు. పాతికేళ్ల తర్వాత కలిసిన వీళ్లు మళ్లీ విడిపోవడానికి కారణం ఏంటి ? ఈ క్రమంలో రాజ్ తరుణ్ తన గురించి తెలుసుకున్న ఓ కీలక నిజం ఏంటి ? వీరిద్దరి ప్రేమలో ఎలా సక్సెస్ అయ్యారు అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ : ఈ సినిమాలో రాజ్ తరుణ్, షాలిని పాండే అద్భుతంగా నటించారు. సాంగ్స్ లో, కెమిస్ట్రీ ఎపిసోడ్స్ లో వీరిద్దరు చాలా బాగా చేశారు. కథానుసారం వచ్చే సాంగ్స్ మరియు లొకేషన్స్ ముఖ్యంగా ఊటీ లొకేషన్స్ లో సమీర్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సెకండాఫ్ మరియు క్లైమాక్స్ లో సాగే ఎమోషనల్ సీన్స్ మరియు మలుపులు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. మిక్కీ సంగీతం కాస్త ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఇతర పాత్రల్లో నటించిన నటినటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ : ఫస్ట్ ఆఫ్ చాలా స్లోగా ఉండటం వల్ల ప్రేక్షకుడికి ఆసక్తి కలగకపోవచ్చు. దర్శకుని లవ్ స్టోరీని మరింత ఆసక్తికరంగా తెరకెక్కించు ఉంటే బాగుండేది. ఎంటర్టైన్మెంట్ అసలు లేకపోవడం పెద్ద మైనస్. స్టోరీగా రొటీన్ గానే ఉంటుంది.

మొత్తంగా : హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే కెమిస్ట్రీ, మంచి లోకేషన్స్ లో సాంగ్స్ వంటివి బాగా ఆకట్టుకుంటాయి. కానీ రొటీన్ స్టోరి.. నిడివి తక్కువే అయినా కూడా బోరింగ్ గా సాగే కథనాలు, కామెడీ లేకపోవడం ప్రేక్షకుడిని మెప్పించలేవు. సో ఫైనల్ గా ప్రేమికులు ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -