- Advertisement -

ఉదయ్ కిరణ్ మరణంపై అసలు నిజం ఇదే..!

- Advertisement -

చిత్రం సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు ఉదయ్ కిరణ్. ఈ సినిమాతో తన టాలెంటో చూపించడమే కాదు.. చిన్న సినిమాలు మంచిగా తీస్తే ఆడుతాయని నిరూపించింది ఈ సినిమా. ఆ తరువాత ఉదయ్ కిరణ్ నటించిన నువ్వునేను-మనసంతా నువ్వే వరుసగా హిట్ లు కావడంతో హ్యాట్రిక్ హీరోగా రికార్డు సాధించారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి హిట్లు కొట్టి సంచలనం సృష్టించాడు ఉదయ్.

అతన్ని క్రేజ్ చూసి మురిసిపోయిన చిరంజీవి ఉదయ్ ని ఇంటి అల్లుడ్ని చేసుకోవాలని అనుకున్నారు. 14 సినిమాలకు సైన్ చేసి ఫుల్ బిజీగా వున్న ఉదయ్ కిరణ్ చిరు కూతురు పెళ్లి ప్రస్థావన.. వివాహం రద్దు కావడం వంటి కారణాలతో చేతిలో వున్న 14 సినిమాలు పోయి ఖాళీ అయిపోయాయన్న ప్రచారం జరిగింది. ఇందుకు కారణం చిరంజీవే అంటూ పుకార్లు వచ్చాయి. ఆ తరువాత ఉదయ్ కి పెళ్లవ్వడం.. రకరకాల ఆర్థిక కారణాలతో ఫ్యామిలీ రీజన్స్ తో ఉదయ్ 2014లో తన ఇంట్లోనే ఉరివేసుకుని చనిపోవడం సంచలనమైంది.

అయితే ఆ ఆత్మహత్యకు .. చిరు కుమార్తెతో పెళ్లి జరగకపోవడానికి ముడి వేస్తూ అప్పట్లో రూమర్స్ తెగ వైరల్ అయ్యాయి. అయితే ఉదయ్ కిరణ్ ఆత్మహత్య వెనుక ఆ పెద్ద హీరో ప్రమేయం లేదని ప్రూవైంది. ఉదయ్ ఆత్మహత్యకు చిరంజీవికి ఎలాంటి సంబంధం లేదని స్వయంగా హీరోగారి అక్క శ్రీదేవి చెప్పారు. ఆ నిశ్చితార్థం క్యాన్సిల్ అయిన తర్వాత కూడా చిరంజీవి తన తమ్ముడి కెరీర్ కు చాలా ప్రాముఖ్యత ఇచ్చారని.. పలు మార్లు ఇంటికి వచ్చి మరీ కలిసారని చెప్పారు శ్రీదేవి. ఇక తాజాగా ఉదయ్ మరణానికి చిరంజీవికి ఎలాంటి సంబంధం లేదని ఓ నిర్మాత క్లారిటీనిచ్చారు.

రామలక్ష్మి సినీక్రియేషన్స్ పతాకంపై ఉదయ్ కిరణ్ హీరోగా వియ్యాల వారి కయ్యాలు సినిమాని లగడపాటి నిర్మించారు. ఈ సినిమా రిలీజ్ సందర్భంలో చిరుని ఇదే విషయంపై ప్రశ్నిస్తే.. ఆ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకున్నారని.. ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారని ఆ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చెప్పుకొచ్చారు. దీంతో చిరు కారణంగా ఉదయ్ కిరణ్ చనిపోయారన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తేలిపోయింది. కొందరు కావాలనే తప్పుడు వార్తలు ప్రచారాలు చేశారని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -