Sunday, May 11, 2025
- Advertisement -

రికార్డు సృష్టించిన మెగాస్టార్!

- Advertisement -
2 million views ammadu lets dokummudu song 24hrs

మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ సినిమా ‘ఖైదీ నెం 150’ పై అభిమానులో భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత చిరు నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఆదివారం సాయంత్రం ఈ చిత్రానికి సంబంధించిన ‘అమ్మడు లెట్స్ డు కుమ్ముడు’ అనే ఆడియో ట్రాక్ యూట్యూబ్ ద్వారా రిలీజ్ చేయగా…. సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. 24 గంటల్లో 20 లక్షల(2 మిలియన్) వ్యూస్‌ సాధించింది. ఈ పాటను కేవలం 24 గంటల్లోనే 20 లక్షల మంది చూశారని, టాలీవుడ్ చరిత్రలో ఇది నెం. 1 రికార్డ్ అని, అత్యంత వేగంగా 2 మిలియన్ల వ్యూస్‌ సొంతం చేసుకున్న ఆడియో సాంగ్‌ ఇదేనని చిత్ర బృందం ట్వీట్‌ చేసింది.

ఆడియో వేడుక జరుగుతుందని అభిమానులంతా భావించారు కానీ…. ఎలాంటి వేడుక లేకుండానే ఆడియోను నేరుగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే జనవరి 4న ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా నిర్వహించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్లో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 11, 2017న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

{youtube}bTBaUlLiwSc{/youtube}

{youtube}7jHMP7J6tRs{/youtube}

Related

  1. చిరుకు అదిరిపోయే షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్!
  2. లీకైన ‘ఖైదీ నెం.150’ మూవీ సాంగ్.. డాన్స్ తో అదరగొట్టిన చిరు, కాజల్!
  3. చిరు రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుస్తే దిమ్మతిరగాల్సిందే!
  4. చిరు పెద్ద కూతురు భలే తయారు చేసింది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -