Thursday, April 18, 2024
- Advertisement -

రహస్యంగా పెళ్లి చేసుకున్న టాలీవుడ్‌ హీరోయిన్‌

- Advertisement -

సినీ సెలబ్రిటీల వివాహం అంటే హడావుడి మాములుగా ఉండవు. నిశ్చితార్థం మొదలు.. పెళ్లి, హనీమూన్‌ ఇలా ప్రతి విషయంపై అభిమానులు ఆసక్తి కనబర్చుతారు. ఇక హీరో, హీరోయిన్లు సైతం తమ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. ప్రతి విషయం ప్యాన్స్‌తో పంచుకుంటారు. ఇక వివాహం కూడా అంగరంగ వైభవంగా చేసుకొని కొద్ది రోజుల పాటు వార్తల్లో నిల్చుతారు. కానీ హరోయిన్‌ ఆనంది మాత్రం గుట్టుచ‌ప్పుడు కాకుండా ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకొని అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అలాగని లవ్‌ మ్యారేజ్‌ చేసుకోలేదు. పెద్దలు కుదిర్చిన సంబంధమే. అది కూడా త‌న స్వ‌స్థ‌ల‌మైన వ‌రంగల్‌లో అతికొద్ది మంది బంధుమిత్రాదుల స‌మ‌క్షంలో పెళ్లి తంతును ముగించారు.

ఇక వరుడు సోక్రటీస్‌ కూడా దర్శకత్వ శాఖలోనే పనిచేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆనంది ఇంత సైలెంట్ గా ఎందుకు పెళ్లి చేసుకోవ‌డంపై మొద‌ట్లో భిన్న వాద‌న‌లు వినిపించాయి. సోక్ర‌టీస్ త‌మిళ సినిమాల్లో ద‌ర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేస్తుండ‌డంతో ల‌వ్‌మ్యారేజ్ అయి ఉంటుంద‌ని భావించారు. కానీ అలాంటిదేమీ లేద‌ని తేలిపోయింది. పెద్ద‌లు అంగీకారంతోనే ఈ వివాహం జరిగిందట.

కాగా, చేతి నిండా సినిమాలతో సక్సెస్‌ఫుల్‌ నటిగా రాణిస్తున్న సమయంలో ఆమె సడెన్‌గా సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవడంపై టాలీవుడ్‌ వర్గాలు, అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఆనంది సినిమా విషయాలకొస్తే.. మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘ఈరోజుల్లో’,సినిమాతో టాలీవుడ్‌‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత‘బస్‌ స్టాప్’, ‘నాయక్’, ‘ప్రియతమా నీవచటకుశలమా’, ‘గ్రీన్ సిగ్నల్’ త‌దిత‌ర సినిమాల్లో ఆనంది న‌టించి మెప్పించారు. త్వ‌ర‌లో విడుద‌ల కానున్న ‘జాంబి రెడ్డి’సినిమాలోనూ హీరోయిన్‌గా నటించింది.

అందుకే నా భార్య కి విడాకులు ఇచ్చాను : సంపత్ రాజ్

ఈ నాగార్జున కూతురు ఇప్పుడు ఎలా ఉందో అవక్కవుతారు…

ఆ హీరోతో నటించేందుకు రూ.2 కోట్లు డిమాండ్ చేస్తున్న సాయి పల్లవి

మహేశ్‌బాబు అభిమాన సంఘం అధ్యక్షుడిగా నాగ చైతన్య!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -