Friday, April 19, 2024
- Advertisement -

అందుకే నా భార్య కి విడాకులు ఇచ్చాను : సంపత్ రాజ్

- Advertisement -

ప్రతినాయకుడి పాత్రలో నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టాలీవుడ్ ప్రముఖ విలన్ సంపత్ రాజ్ గురించి ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే సంపత్ రాజు మొదటగా తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పంజా చిత్రంలో విలన్ గా నటించిన తెలుగు సినిమా పరిశ్రమకు నటుడిగా పరిచయం అయ్యాడు.

 అయితే అంతకు ముందు పలు తమిళ – తెలుగు అనువాద చిత్రాలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. పంజా చిత్రం తర్వాత యంగ్ రెబల్ స్టార్ హీరోగా నటించినటువంటి మిర్చి చిత్రంలో విలన్ గా నటించడంతో ఒక్కసారిగా సంపత్ రాజ్ సినిమా లైఫ్ మారిపోయిందని చెప్పవచ్చు.  తాజాగా సంపత్ రాజ్ తన భార్య శరణ్య పొన్వనన్ తో విడాకులు విషయంపై స్పందించాడు. ఇందులో భాగంగా అతను తన భార్యను 19 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నానని తెలిపాడు. అయితే తను శరణ్య ను పెళ్లి చేసుకున్న సమయంలో కెరియర్ గురించి అస్సలు ఆలోచించలేదని, కానీ పెళ్లయిన కొంతకాలానికి తన కెరియర్ గురించి ఆలోచించడం మొదలు పెట్టడం వల్ల ఇద్దరి మధ్య కొంతమేర విభేదాలు మనస్పర్థలు వచ్చాయని చెప్పుకొచ్చాడు. అందువల్ల ఇక ఆ బంధం కొనసాగితే ఇద్దరికీ ముప్పు వాటిల్లుతుందని పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నామని తెలిపాడు. తాము విడాకులు తీసుకున్న తర్వాత తన కూతురు బాధ్యతను తానే తీసుకున్నానని  ఇటీవలే తన కూతురు చదువులను పూర్తిచేసుకొని తన వద్దే ఉంటుందని తెలిపాడు. అయితే తన భార్య శరణ్య తో విడాకులు తీసుకున్నప్పటికీ అప్పుడప్పుడు ఫోన్ చేసి తన యోగక్షేమాలు తెలుసుకుంటుంటానని చెప్పుకొచ్చాడు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం తెలుగులో ప్రముఖ దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వం  వహిస్తున్న రెడ్ అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్నాడు. అంతేగాక టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న నారప్ప చిత్రంలో కూడా సంపత్ రాజ్ విలన్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

ఈ హీరోయిన్ ఆ సింగర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.. కానీ 6 నెలలకే…

మహేశ్ బాబు సినిమాలో పవన్ కల్యాణ్ మాజీ భార్య!

గుండె కోసం ఈ పది సూపర్ ఫుడ్స్

హీరోయిన్ రీమాసేన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -