నోరు పారేసుకున్న వార్న్.. మ‌రీ ఇంత నీచ‌మా!

- Advertisement -

సిడ్నీ: ఆస్ట్రేలియా దిగ్గజ బౌల‌ర్‌గా పేరొందిన‌ షేన్‌ వార్న్ కు కాస్త నోటి దురుసు ఎక్కుకే అన్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. స్పిన్ బౌల‌ర్‌‌గా ఎంత‌టి పేరు ప్ర‌ఖ్యాతులు పొందాడో.. త‌న దుందుడుకుత‌నంతో వ్య‌క్తిగ‌తంగా అనేక విమ‌ర్శ‌లు మూట‌గ‌ట్టుకున్నాడు. రిటైరైన త‌ర్వాత అత‌డు కామెంటేట‌ర్‌గా కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ఇక తాను క్రికెట్ ఆడే స‌మ‌యంలో ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల ఆట‌గాళ్ల‌పై స్లెడ్జింగ్‌కు దిగి వివాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన వార్న్ ఈసారి త‌మ జ‌ట్టు క్రికెట‌ర్ ల‌బుషేన్ గురించి అస‌భ్య‌క‌రంగా మాట్ల‌డాడు. టీమిండియా- ఆసీస్ మ‌ధ్య సిడ్నీలో జ‌రుగుతున్న మూడో టెస్టు సంద‌ర్భంగా ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

మ్యాచ్ రెండో రోజు మొదటి సెషన్‌లో మరో మాజీ ఆటగాడు ఆండ్రూ సైమండ్స్‌తో కలిసి వార్న్ కామెంటరీ చేశాడు. ఈ క్ర‌మంలో లబుషేన్‌ క్రీజులో చూపిస్తున్న మేనరిజమ్స్‌పై సైమండ్స్‌ ఏదో చెబుతుండ‌గా..వార్న్‌ దానికి అడ్డుపడుతూ..’మొదట బ్యాట్‌ను సరిగా పట్టుకోమను.. చూడలేక‌పోతున్నాం.. ఇబ్బందిగా ఉంది..స‌ అని వ్యాఖ్యానించాడు. ఇక ఇందుకు సైమండ్స్ ​స్పందిస్తూ బూతు పదాన్ని ఉపయోగించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. వార్న్, సైమండ్స్ ను నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు.‌‌

- Advertisement -

కాగా ఇటీవ‌ల టీమిండియా, ఆసీస్‌ల మధ్య తొలి టెస్టు సమయంలో చతేశ్వర్‌ పుజారాను ఉద్దేశించి.. త‌న పేరు ప‌లికేందుకు నోరు తిర‌గ‌డం లేద‌ని, అతన్ని స్టీవ్‌ అని పిలుస్తానన‌డంతో వార్న్ పై భార‌త అభిమానులు సామాజిక మాధ్య‌మాల్లో దుమ్మెత్తిపోశారు. దీంతో ఎట్ట‌కేల‌కు అత‌డు క్ష‌మానప‌ణ చెప్ప‌క‌త‌ప్ప‌లేదు. ఇక మూడో టెస్టులో ఆసీస్ 338 ప‌రుగుల‌కు తొలి ఇన్నింగ్స్ ముగించింది.

ఏయ్ నీకిష్ట‌మైన క్రికెట‌ర్ ఎవ‌రు.. గిల్ కౌంట‌ర్‌!

సిడ్నీ టెస్టు: అతని చేతుల మీదుగా సైనీకి క్యాప్‌

రెండో టెస్టులో జడేజా స్టన్నింగ్‌ క్యాచ్‌!

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...