మహేశ్‌బాబు అభిమాన సంఘం అధ్యక్షుడిగా నాగ చైతన్య!

- Advertisement -

యంగ్‌ హీరో అక్కినేని నాగ చైతన్య వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ‘లవ్‌ స్టోరీ’సినిమా తర్వాత నాగ చైతన్య విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ‘థాంక్యూ’అనే ఇంట్రస్టింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం అబిడ్స్‌లోని రామకృష్ణ సినిమా హాల్‌లో జరుగుతుండగా.. చైతుపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే చిత్రానికి సంబంధించి ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది.

ఈ సినిమాలో అభిరామ్ అనే యువకుడి పాత్ర పోషిస్తున్న నాగ చైతన్య.. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమాన సంఘ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ అలరించబోతున్నారని సమాచారం. అలాగే ఈ సినిమాలో మహేశ్‌ కొన్ని నిమిషాలపాటు తళుక్కున మెరవబోతున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ విషయం బయటకు రావడంతో మహేష్ బాబు ఫ్యాన్స్‌తో పాటు అక్కినేని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.

- Advertisement -

మహేశ్‌బాబుకి అక్కినేని ఫ్యామిలీతో మంచి బాండింగ్‌ ఉంది. అఖిల్ తొలి సినిమా అఖిల్ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు మహేశ్ బాబు హాజరయ్యాడు. తాజాగా నాగచైతన్య సినిమాలోనూ కనిపించి.. మరోసారి అక్కినేని ఫ్యామిలీతో బాండింగ్‌ను మహేశ్ బాబు మరోసారి గుర్తు చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు దిల్‌రాజు, శిరీష్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నాగ చైతన్య సరసన ఐశ్వర్య లక్ష్మి, అవికా గోర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా 2021 చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘ఆచార్య’ టెంపుల్ సెట్ ఓ మహా అద్భుతం : చిరంజీవి

స్విమ్మింగ్ ఫూల్ లో రెచ్చిపోయిన ఐటమ్ బ్యూటీ…

అందుకే నా భార్య కి విడాకులు ఇచ్చాను : సంపత్ రాజ్

టాలీవుడ్ ఫేవ‌రెటిజంపై అన‌సూయ సంచలన వ్యాఖ్యలు

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...