Friday, March 29, 2024
- Advertisement -

ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు.. అజిత్ పక్కన ఉన్నది ఎవరో తెలుసా?

- Advertisement -

మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అనే మాటకు నిర్వచనంలా కనిపించే సినీ జంట అజిత్‌, షాలిని. తెలుగు లో గొల్లపూడి మారుతీరావు తెరకెక్కించిన ‘ప్రేమ పుస్తకం’ చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు అజిత్ కుమార్. హైదరాబాదీ అయిన అజిత్ కి టాలీవుడ్ లో పెద్దగా సక్సెస్ అందలేదు..దాంతో తమిళ తెరపై తన సత్తా చాటుకుంటూ వచ్చాడు. ప్రస్తుతం రజినీ తర్వాత అజిత్ కి అక్కడ మాస్ ఫాలోయింగ్ బాగా ఉంది.

అజిత్ ది ప్రేమ వివాహం. మతాలు వేరైనా వాళ్ల మనసులు కలిశాయి. పెద్దలను ఒప్పించి పెళ్లితో ఒకటైన ఈ జంట వైవాహిక జీవితం 15 ఏళ్లుగా రాక్‌ సాలిడ్‌గా సాగిపోతూనే ఉంది. అజిత్‌, షాలినిలకు 2008 జనవరి 3న పాప పుట్టింది. పాప పేరు అనౌష్క. 2013 మార్చి 2న బాబు పుట్టాడు. బాబుకు ‘ఆద్విక్‌ అజిత్‌ కుమార్‌’ అని పేరు పెట్టుకుందీ జంట.

అజిత్ హీరోగా ఎంత పాపులర్ అయినా ఆయన తల్లిదండ్రులు ఎవరికీ తెలియదు. కారణం వారు అజిత్‌ సినీలోకానికి దూరంగా ఉండడమే. ఇన్నాళ్లకు అజిత్‌ తన తల్లిదండ్రులతో ఉన్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవడం విశేషం. అజిత్‌ తండ్రి పేరు సుబ్రమణియం, తల్లి మోహిని. ఇటీవల అజిత్‌ తన తల్లిదండ్రులతో కలిసి ఇటీవల ఒక దేవాలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకున్నారు. 

ముద్దుల మనవడితో నందమూరి బాలయ్య!

గౌతమ్‌ను హత్తుకుని మహేశ్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు..

’ఖిలాడీ’ లో అనసూయ..!

చార్మీ కుక్కతో డార్లింగ్ ప్రభాస్ ఫొటో..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -