Monday, April 29, 2024
- Advertisement -

ముద్దుల మనవడితో నందమూరి బాలయ్య!

- Advertisement -

నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఓ వైపు రాజకీయాలు మరోవైపు సినిమాల్లో బిజీగా కొనసాగుతున్నారు. ఇటీవల కరోనా నేపథ్యంలో ఈ చిత్రం వాయిదా వేసిన విషయం తెలిసిందే. బీ3 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోంది.  సినిమా, రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా.. తన కుటుంబం అంటే ఎంతో ఇష్టంగా గడుపుతుంటారు.

ఈ క్రమంలో బాలయ్య తన ముద్దుల మనవడు ఆర్యవీర్‌తో సరదాగా దిగిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఫోటోలో బాలయ్య తన చిన్న కూతురు తేజస్విని కుమారుడితో ఫోటోకు ఫోజిచ్చారు. ఇక బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా ఇది. గతంలో వీరి కాంబినేషన్‌లో రెండు సినిమాలు వచ్చాయి. బోయపాటి బాలయ్య కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చాడు.

ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో ‘లెజెండ్’.. ‘సింహ’ను మించి విజయం అందుకుంది. ఈ రెండు సినిమాల తర్వాత వస్తోన్న ఈ తాజా సినిమా ‘లెజెండ్’ను మించిన హిట్ అవ్వాలనీ బాలయ్య ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.  తాజా చిత్రంలో సంప్రదాయ దుస్తులు ధరించిన చిన్నోడిని ఒళ్లో కూర్చోబెట్టుకుని బాలయ్య చిరునవ్వులు చిందిస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ చిత్రాన్ని మీరూ చూడవచ్చు.

గౌతమ్‌ను హత్తుకుని మహేశ్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు..

’ఖిలాడీ’ లో అనసూయ..!

వర్మ వార్నింగ్ తో ఏం చెబుతున్నాడో తెలుసా!

షూటింగ్‌లో గోవా బ్యూటీ ఇలియానకు గాయం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -