Friday, May 17, 2024
- Advertisement -

రాష్ట్రంలో భాజాపా క‌ల‌సి ఉండాలంటే..టీడీపీని వ‌దిలేయండి అంటూ భాజాపా కార్య‌క‌ర్త‌ల నినాదాలు

- Advertisement -
Leave TDP only BJP in Venkaiah Naidu public meet at vijayawada

ఆంద్ర‌ప్ర‌దేశ్‌లో భాజాపా-టీడీపీ బంధంపై నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి. ఇక ఎక్కువ రోజులు వీరి మ‌ధ్య బంధం కొన‌సాగేట‌ట్లు క‌నిపించ‌డంలేదు.ఇప్ప‌టికే మిత్ర‌ప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధం తారాస్తాయికి చేరింది.

టీడీపీతో తెగ‌దెంపులు చేసుకోవాల‌ని భాజాపా రాష్ట్ర పార్టీ నాయ‌క‌త్వం ప‌ట్టుద‌ల‌తో ఉంది.క‌మ‌ళం ఛీప్ రాష్ట్ర ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ఆయ‌న‌కు టీడీపీపై పిర్యాదు చేశారు భాజాపా నాయ‌కులు.
2014 ఎన్నిక‌ల్లో భాజాపా-టీడీపీ క‌ల‌సి పోటీచేశాయి.వారికి తోడు ప‌వ‌ణ్‌క‌ళ్యాన్‌కూడా తోడ‌వ‌డంతో అధికారాన్ని చేప‌ట్టారు.కొన్ని రోజులు వీరి మ‌ధ్య సంసారం స‌జావుగా సాగినా … రాను రాను ఇరు పార్టీల్లోనూ అసంతృప్తి నెల‌కొంది. అధిష్టానం నిర్ణ‌యంతో బ‌ల‌వంతంగా క‌ల‌సి ఉంటున్నా క్షేత్ర‌స్థాయిలో మాత్రం కార్య‌క‌ర్త‌లు పొత్తును వ్య‌తిరేకిస్తున్నారు.

{loadmodule mod_custom,Side Ad 1}

మిత్ర‌ప‌క్షం నుంచి వ‌స్తున్న‌విమ‌ర్శ‌ల‌ను బాబు త‌ట్టుకోలేక పోతున్నారు.సందు దొరికిన‌ప్పుడ‌ల్లా మిత్ర‌ప‌క్షం అని చూడ‌కుండా చీల్చి చెండాడుతున్నారు.ఇక భాజాపా సీనియ‌ర్‌నేత పురందేశ్వ‌రి బాబునే టార్గెట్ చేసింది.పార్టీ పిరాయింపులు,రాజ‌ధానిలో జ‌రుగుతున్న భూకుంభ‌కోనాల‌మీద అప్ప‌ట్లో కేంద్రానికి రాసిన లేఖ సంచ‌ల‌నంగా మారింది.
ఇక వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌ధాని మోదీని క‌ల‌సిన విష‌యం రాష్ట్రంలో ఎంత రాజ‌కీయ దుమారం రేపిందో తెలిసిందే.టీడీపీ నేత‌లు అయితే వీరి భేటీపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.అస‌లు మోదీ జ‌గ‌న్‌కు అపాయంట్ మెంట్ ఇవ్వ‌డం ఏంట‌ని విమ‌ర్శించిన తీరు వివాదాస్ప‌దంగా మారింది.అంతే రీతిలో మిత్ర‌ప‌క్షం భాజాపాకూడా టీడీపీ నాయ‌కుల‌కు కౌంట‌ర్ ఇచ్చారు.

{loadmodule mod_custom,Side Ad 2}

జ‌గ‌న్‌,మోదీ క‌ల‌వ‌డంపై టీడీపీ చేసిన విమ‌ర్వ‌ల‌పై కేంద్రంనుంచి రాష్ట్ర‌నాయ‌క‌త్వం వ‌ర‌కు జ‌గ‌న్‌కు స‌పోర్ట్‌గానే మాట్లాడంతో బాబుకు ఏంచేయాలో పాలుపోవ‌డంలేదు. భ‌విష్య‌త్తులో టీడీపీతో భాజాపా తెగ‌దెంపులు చేసుకోవ‌డం కాయం అని విశ్లేష‌కులు అంటున్నారు.ఇప్పుడ అమీత్‌షా రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తుండ‌టంతో టీడీపీ-భాజాపా బంధంపై ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి.

రాష్ట్ర భాజాపా నాయ‌క‌త్వం అమీత్‌షాకు రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిస్తితుల‌ను వివ‌రించారు.టీడీపీ ప్ర‌భుత్వం అవినీతి బుర‌ద‌లో కూరుకు పోయింద‌నీ అమీత్‌షాకు పిర్యాదు చేశారు.దీనికి బ‌లం చేకూరుస్తూ వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కష్టమేనని బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయడం కష్టమేనన్నారు. 

{loadmodule mod_custom,Side Ad 1}

విజ‌య‌వాడ‌లో బూత్‌స్థాయి కార్య‌క‌ర్త‌ల స‌మావేశం బ‌హిరంగ స‌భ‌లో టీడీపీకీ వ్య‌తిరేకంగా భాజాపా కార్య‌క‌ర్త‌లు నినాదాలు చేస్తారు.రాష్ట్రంలో భాజాపా బ‌తికిండాలంటే …టీడీపీని వ‌దిలేయండంటూ బ‌హిరంగ స‌భ‌లో ప్లాకార్డులు ప్ర‌ద‌ర్శించారు.అదిష్టానం నిర్న‌యాన్ని కాద‌న‌లేక టీడీపీతో బ‌ల‌వంతంగా క‌ల‌సి ఉంటున్నాది దీంతో తెలిసిపోయింది.అన్నీ చూస్తుంటే భాజాపా-టీడీపీ త్వ‌ర‌లోనే విడాకులు తీసుకొనే ప‌రిస్థిత‌లు క‌నిపిస్తున్నాయి.

{loadmodule mod_sp_social,Follow Us}

 Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -