Thursday, May 2, 2024
- Advertisement -

అది మ‌రి బ‌న్నీ అంటే.. ఆ మాత్రం ఉంటుందిలే!

- Advertisement -

టాలీవుడ్ హీరో, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఒక్క‌సారి ఆయ‌న‌ను ప్ర‌త్య‌క్షంగా చూస్తే చాలు అనుకునే అభిమానులు కొకొల్ల‌లు. అలాంటిది, బ‌న్నీ త‌మ ఏరియాకి వ‌చ్చాడ‌ని తెలిస్తే ఆ అవ‌కాశాన్ని మిస్ చేసుకుంటారా ఎవ‌రైనా? ఒక్క క్ష‌ణం ఆల‌స్యం చేయ‌కుండా ఎక్క‌డుంటే అక్క‌డికి ప‌రుగులు తీస్తారు. రంప‌చోడ‌వరంలో తాజాగా ఇలాంటి ఘ‌ట‌నే జ‌రిగింది.

బ‌న్నీ ప్ర‌స్తుతం సుకుమార్ డైర‌క్ష‌న్‌లో ‘పుష్ప’ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. గత నెల రోజులుగా రంపచోడవరం సమీపంలోని మారేడుమిల్లి ఆటవీ ప్రాంతంలో ఈ మూవీ షూటింగ్ జ‌రుగుతోంది.అయితే కొన్ని కార‌ణాల ద్రుష్ట్యా అభిమానులు బ‌న్నీని క‌లిసేందుకు కుద‌ర‌లేద‌ట‌. దీంతో మంగ‌ళ‌వారం షెడ్యూల్ పూర్తి చేసుకుని బ‌న్నీ హైదరాబాద్ వెళ్తున్నాడ‌ని తెలియ‌డంతో, రంపచోడవరం జంక్ష‌న్‌లో ఫ్యాన్్స పోగ‌య్యారు.

ఇక అభిమానుల ప్రేమ‌కు పొంగిపోయిన అల్లు అర్జున్ కారు రూఫ్ టాప్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి, అంద‌రికీ అభివాదం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన బ‌న్నీ.. ‘థాంక్ యూ రంపచోడవరం’ అంటూ అభిమానుల ప్రేమ‌కు ముగ్ధుడైన‌ట్లు తెలిపాడు. మొబైల్ ఫోన్ల లైట్ల వెలుగులో బ‌న్నీని చూస్తూ మురిసిపోతున్న ఫొటో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

గుళ్ల‌ను కూల్చినోడు క‌దా అందుకే ఇలా

పూరి జగన్నాథ్ పరిచయం చేసిన హీరోయిన్లు వీళ్ళే..!

షార్ట్ ఫిలిమ్స్ తో పరిచమైన నటీనటులు..!

మన హీరోలు వాడే కార్లు వాటి ఖరీదు ఎంతంటే ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -