Sunday, April 28, 2024
- Advertisement -

అంజీర పండ్లతో చక్కటి ఆరోగ్యం!

- Advertisement -

మనం నిత్యం తినే పండ్లలో ఎన్నో పోషక పదార్థాలు ఉన్నాయన్న విషయం తెలిందే. ముఖ్యంగా జామ,నిమ్మ,దానిమ్మ,ద్రాక్షా ఇలా ఎన్నో పండ్లతో మంచి ఆరోగ్యాన్ని పొందవొచ్చు. అంజీర పండుతో చక్కటి ఆరోగ్యాన్ని పొందవొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంజీర్‌ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో రోగనిరోధకశక్తిని పెంచే గుణాలు ఎన్నో ఉన్నాయి. ఏ వ్యాధితో బాధపడుతున్న వాళ్లయినా అత్తి పండును ఎండురూపంలో గానీ, పండుగా గానీ తీసుకుంటే త్వరగా కోలుకుంటారు.

-రక్తహీనతతో బాధపడే వారికీ రోజు ఈ అంజీర పండ్లను 3 లేదా 4 తీసుకోవటం వల్ల రక్తహీనత తగ్గి హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. ప్లేట్లెట్స్ తగ్గిన వారికీ కూడా ఇది చాలా మంచిది.

-లైంగిక సామర్థ్యం రెట్టింపు చేస్తుంది. సంతానం లేని సమస్యలను దూరం చేస్తుంది. స్త్రీలు, పురుషులలో ఇన్ఫెర్టిలిటీ సమస్య కూడా తగ్గిస్తుంది. వీర్యపుష్టి కలుగుతుంది. గర్భాశయ వ్యాధులు తొలగిపోతాయి.

-పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల గుండెకి బలాన్ని చేకూరుస్తుంది. బిపిని కంట్రోల్ లో ఉంచుతుంది. శరీర మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది.

-ఇన్సులిన్ స్థాయిలను క్రమబద్దీకరించి షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ ఉంచుతుంది. శరీరంలోని టాక్సిన్స్ బయటకి పంపిస్తాయి. చెడు కొలెస్టాల్ ని తగ్గించి, మంచి కొలెస్టాల్ ని పెంచుతుంది. రొమ్ము కాన్సర్ ప్రేగు కాన్సర్ ను రాకుండా చేస్తుంది. అంతేకాదు గుండె జబ్బులు కూడా తగ్గిస్తుంది.

-అంజీర పండ్లలో విటమిన్ ఏ, బి, బి 12, సి ఉంటాయి. వీటిలో కొవ్వు పిండి పదార్ధాలు కాలిష్యం, ఐరన్, పొటాషియం, ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఒమెగా 3 ఫ్యాటిఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. దీనిలో ఇంకా సెల్యూలోజ్ కూడా లభిస్తుంది.

మూత్రపిండాల్లోరాళ్ళు సమస్య నివారణకుతీసుకోవాలిసినజాగ్రత్తలు!

గుండె కోసం ఈ పది సూపర్ ఫుడ్స్

జీడిప‌ప్పు ఆరోగ్య ర‌హ‌ష్యాలు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -